UK PM Boris Johnson: బ్రిటన్ ప్రధానికి విడాకులు, మరీనా వీలర్ నుంచి విడాకులు తీసుకున్న బోరిస్ జాన్సన్, సెటిల్మెంట్ రూపంలో వీరిద్దరికీ చెరో నాలుగు మిలియన్ పౌండ్లు
పదవిలో ఉండగానే ఓ ప్రధాని విడాకులు పొందడం గత 250 ఏళ్లలో ఇదే తొలిసారి కావడంతో బోరిస్ (UK PM Johnson) చరిత్రకెక్కారు. ఫిబ్రవరిలోనే మరీనా వీలర్ (Marina Wheeler) విడాకులకు దరఖాస్తు చేసుకోగా.. స్థానిక ఫ్యామిలీ కోర్టు ఇటీవల వారికి విడాకులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి.. సెటిల్మెంట్ రూపంలో వీరిద్దరికీ చెరో నాలుగు మిలియన్ పౌండ్లు లభించనున్నట్టు తెలుస్తోంది.
London, May 9: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (British Prime Minister) తన బార్య, భారత సంతతికి చెందిన న్యాయవాది మరీనా వీలర్ నుంచి విడాకులు తీసుకున్నారు. పదవిలో ఉండగానే ఓ ప్రధాని విడాకులు పొందడం గత 250 ఏళ్లలో ఇదే తొలిసారి కావడంతో బోరిస్ (UK PM Johnson) చరిత్రకెక్కారు. ఫిబ్రవరిలోనే మరీనా వీలర్ (Marina Wheeler) విడాకులకు దరఖాస్తు చేసుకోగా.. స్థానిక ఫ్యామిలీ కోర్టు ఇటీవల వారికి విడాకులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి.. సెటిల్మెంట్ రూపంలో వీరిద్దరికీ చెరో నాలుగు మిలియన్ పౌండ్లు లభించనున్నట్టు తెలుస్తోంది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఆగస్ట్ 31లోపు పూర్తి చేయండి, లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యామూర్తిని ఆదేశించిన సుప్రీంకోర్టు
జాన్సన్, వీలర్‌లు 1993 వివాహం చేసుకోగా వీరికి నలుగురు సంతానం కలిగారు. దాదాపు 25 ఏళ్ల తరువాత 2018లో జాన్సన్ దంపతులు తాము విడిపోతున్నట్టు ప్రకటించగా..ఇటీవల వారికి విడాకులు ఖరారయ్యాయి. జాన్సన్ తొలి వివాహం 1987లో జరిగింది. ఆయనకు 23ఏళ్ల వయసున్నప్పుడు తన మొదటి భార్య అలెగ్రా మాస్టీన్ ఒవెన్‌ను కలుసుకున్నారు. వీరిరువురూ 1993లో విడిపోగా ఆ తరువాత మరీనా వీలర్‌ను జాన్సన్ రెండో వివాహం చేసుకున్నారు.
ఇదిలా ఉంటే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా మహమ్మారి బారిన పడి చివరి వరకు పోరాడి ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. అయితే, కరోనాతో పోరాడుతున్న సమయంలో ఒకవేళ తాను చనిపోతే ఆ వార్తను బయటి ప్రపంచానికి ఎలా తెలియజేయాలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యులు ప్రణాళికలు కూడా సిద్ధం చేశారని స్వయంగా బోరిస్ జాన్సన్ వెల్లడించారు. వైద్యులు లీటర్ల కొద్దీ ఆక్సిజన్ ఖర్చు చేస్తున్నా.. ఎలాంటి పురోగతి కనిపించకపోయే సరికి.. తాను మరణిస్తాననే అంచనాకు వైద్యులు వచ్చారని చెప్పారు. అయితే, ఆ విషయాన్ని ఎలా బయటకు చెప్పాలన్న ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని.. అది తనకు అర్థమవుతూనే ఉందని తెలిపారు. అవన్నీ ఓ చేదు జ్ఞాపకాలు అంటూ బోరిస్ జాన్సన్ భావోద్వేగానికి గురయ్యారు.