Supreme Court of India |(Photo Credits: IANS)

New Delhi, May 8: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అడుగులు పడుతున్న వేళ.. సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలను జారీచేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసును (Babri Masjid Demolition Case) ఆగస్ట్‌ 31లోపు పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని (Lucknow Special CBI Court) దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కాగా ఈ కేసులో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, అశోక్‌ సింఘాల్‌, మురళీ మనోహర్‌ జోషీ, ఉమాభారతి, వినయ్‌ కటియార్‌, గిరిరాజ్‌ కిషోర్‌, నాటి యూపీ సీఎం కళ్యాణ్‌సింగ్‌ వంటి వారు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.  రామజన్మభూమిలో ఎలాంటి సమాధులు లేవు, సమాధులపై రామాలయం ఎలా కడతారనే ముస్లీంల లేఖకు వివరణ ఇచ్చిన అయోధ్య డీఎమ్

కరసేవకులను రెచ్చగొట్టి కుట్రపూరితంగానే మసీదును (Babri Masjid) కూల్చివేశారని (కుట్ర) ఆరోపణలను వీరంతా ఎదుర్కొంటున్నారు. దాదాపు 28 ఏళ్ల పాటు కోర్టుల్లో ఈ కేసు విచారణ సాగుతోంది. సుప్రీంకోర్టు తాజాగా బాబ్రీ మసీదు కూల్చివేత కేసును తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో విచారణ, తీర్పు కోసం కాలపరిమితిని గత ఏడాది సుప్రీంకోర్టు తొమ్మిది నెలల పొడిగించింది.

Update by ANI

నివేదికల ప్రకారం, ఈ కేసులో పాల్గొన్న న్యాయవాది విచారణలను వాయిదా వేయడానికి కరోనావైరస్ వ్యాప్తికి కారణమని పేర్కొన్నందున అదనపు సమయం అవసరమని తెలిపినట్లుగా తెలుస్తోంది. ఈ కేసును మరింతగా వాయిదా వేయవద్దని సుప్రీంకోర్టు ప్రత్యేక సిబిఐ కోర్టును కోరింది. COVID-19 వ్యాప్తి మధ్య వీడియో-స్ట్రీమింగ్ ద్వారా విచారణ జరపాలని కోరింది.

అయోధ్య వివాదంపై తీర్పును వెలువరిస్తున్న సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తీర్పును వెలువరిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘1992 డిసెంబర్‌ 6న కరసేవకులు చట్ట విరుద్ధంగా వివాదాస్పద బాబ్రీ మసీదును కూల్చివేశారని, మసీదును ధ్వసం చేసి ఇస్లామిక్‌ మూలాలను దెబ్బతీయడానికి ప్రయత్నించారని కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లిం వర్గాలకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందంటూ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో విచారణను ముగించాలని సుప్రీంకోర్టు సీబీఐ కోర్టును ఆదేశించింది.

బాబ్రీ మసీదు కూల్చివేతపై 1992 డిసెంబర్‌ 6న సాయంత్రం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో 198/92 నెంబర్‌తో మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. వీరిలో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, అశోక్‌ సింఘాల్‌, మురళీ మనోహర్‌ జోషీ, ఉమాభారతి, వినయ్‌ కటియార్‌, గిరిరాజ్‌ కిషోర్‌, నాటి యూపీ సీఎం కళ్యాణ్‌సింగ్‌ ఉన్నారు. అయితే 2003 సెప్టెంబర్‌ 19న రాయ్‌బరేలీలోని స్పెషల్‌ మెడిస్ట్రేట్‌ అద్వానీ, జోషీలకు విచారణ నుంచి విముక్తి కల్పించింది.

అయితే దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా 2017లో తీర్పును వెలువరిస్తూ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్వానీ, జోషీ, ఉమా భారతి, కళ్యాణ్‌ సింగ్‌లను కూడా విచారించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ వీరందరినీ విచారించనుంది. కేసు విచారణ తుది దశతో ఉన్న నేపథ్యంలో.. నేరం రుజువైతే శిక్ష కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.