Ayodhya Ram Mandir: రామజన్మభూమిలో ఎలాంటి సమాధులు లేవు, సమాధులపై రామాలయం ఎలా కడతారనే ముస్లీంల లేఖకు వివరణ ఇచ్చిన అయోధ్య డీఎమ్, ఈ నెల19న ట్రస్టు తొలి సమావేశం
Proposed Ram Mandir Structure (Photo Credits: Twitter)

Ayodhya, Febuary 18: రామాలయ నిర్మాణం కోసం కేటాయించిన భూముల్లో సమాధులు ఉన్నాయంటూ అయోధ్యకు చెందిన కొందరు ముస్లింలు ఆలయ ట్రస్టుకు లేఖ రాసిన విషయం విదితమే. ఈ విషయంపై అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ అనూజ్ ఝా (Ayodhya DM Anuj Jha) వివరణ ఇచ్చారు. అయోధ్య కేసులో (Ayodhya Case) ముస్లింల తరఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు లాయర్ షంషాద్ చెప్తున్నట్టుగా రామ జన్మభూమి స్థలంలో (Ayodhya Ram Mandir) ఎలాంటి సమాధులూ లేవని ఆయన స్పష్టం చేశారు.

అయోధ్యలో ఆకాశాన్ని తాకేలా రామమందిరం

ముస్లింల సమాధులున్న చోట రామాలయం ఎలా కడతారంటూ రామ జన్మభూమి క్షేత్ర ట్రస్టుకు (Shri Ram Janmabhoomi Teertha Kshetra) శంషాద్ లేఖ రాసిన నేపథ్యంలో అనూజ్ ఝా వెంటనే వివరణ ఇచ్చారు. రామాలయం నిర్మాణం చేపట్టనున్న 67 ఎకరాల స్థలంలో ఎక్కడా ఎలాంటి సమాధులు లేవన్నారు‘‘ఇప్పుడు లాయర్ షంషాద్ చేస్తున్న వాదనతో సహా అన్ని అంశాలను సుప్రీంకోర్టు తన విచారణ సమయంలో పరిశీలించింది.

అయోధ్యలో రామ‌మందిర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

అప్పుడే కోర్టుకు అన్ని వివరాలు అందజేశాం. ఆయా అంశాల్లో నిజానిజాలేమిటన్నది స్పష్టంగా పేర్కొంటూ తీర్పు కూడా ఇచ్చింది. రామ జన్మభూమి ప్రాంతంలో ఎలాంటి శ్మశానం, సమాధులు లేవు. కోర్టు అన్నీ పరిశీలించాకే.. ఈ స్థలాన్నికేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది. కోర్టు ఆదేశాల ప్రకారం మేం నడుచుకుంటున్నాం..” అని వివరించారు.

30 ఏళ్ల క్రితమే రామ్ మందిర్ డిజైన్

సమాధులపై ఆలయం నిర్మించడం ‘‘సనాతన ధర్మాన్ని’’ ఉల్లంఘించడమేననీ.. ముస్లింల సమాధులపై రామాలయం ఎలా నిర్మిస్తారంటూ కొందరు ముస్లీంలు ట్రస్టుకు లేఖ రాశారు. అయోధ్య కేసులో ముస్లింల తరపున వాదిస్తున్న న్యాయవాది ఎంఆర్ షంషద్... ఆలయ ట్రస్టుకు సారధ్యం వహిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ కె. పరాశరన్‌కు ఈ లేఖను పంపారు.

అయోధ్య కేసుపై చారిత్రాత్మక తీర్పు

బాబ్రీ మసీదును కూల్చిన స్థలం చుట్టూ శ్మశానం ఉందనీ 1885 అయోధ్య అల్లర్లలో మృతి చెందిన ముస్లింలను అక్కడే ఖననం చేశారని ఈ లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటుగా 1994లో ఇస్లామీ ఫరూఖీ తీర్పును కూడా ఈ లేఖలో ఉటంకించారు. ‘‘వివాదాస్పద కట్టడం చుట్టూ మూడు వైపులా సమాధులు ఉన్నాయి...’’ అని ఆ తీర్పులో పేర్కొన్నట్టు వెల్లడించారు.

అయోధ్య కేసులో ఆది నుంచి ఏం జరిగింది ?

రికార్డుల ప్రకారం... 1885 అల్లర్లలో 75 మంది ముస్లింలు చనిపోయారు. వారి సమాధులన్నీ ప్రస్తుతమున్న మసీదు పరిసరాల్లోనే ఉన్నాయి. నాటి నుంచి ఈ స్థలాన్ని శ్మశానం కోసం వాడుతున్నాం..’’ అని ముస్లింలు పేర్కొన్నారు. ముస్లింల సమాధులపై రామాలయం నిర్మించడం ఆమోదయోగ్యమో కాదో ఆలోచించాలని కోరారు. 67 ఎకరాల స్థలం విషయంలో ముస్లింల గురించి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు.

మసీదు నిర్మాణం కోసం ఎలాంటి ప్రత్యామ్నాయ భూమి, విరాళాలు అంగీకరించం

1948లో మసీదులో బలవంతంగా శ్రీరాముడి విగ్రహాలు పెట్టడం, 1992లో మసీదును ధ్వసం చేయడం వల్ల తదితర కారణాల వల్ల ఈ ప్రదేశం మొత్తం చిందరవందరగా మారింది. అందువల్ల ఇవాళ అక్కడున్న సమాధులు పైకి కనబడక పోవచ్చు...’’ అని సదరు లేఖలో ముస్లింలు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై అయోధ్య మెజిస్ట్రేట్ పూర్తి వివరణ ఇచ్చారు.

సుప్రీంకోర్టు తీర్పు మేరకు రామాలయం నిర్మాణం కోసం ఆలయ ట్రస్టును ఏర్పాటు చేసినట్టు ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 67 ఎకరాల రామజన్మభూమి స్థల సముదాయాన్ని రామాలయ నిర్మాణం కోసం కేటాయిస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు.

కాగా అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు’ మొదటి సమావేశం ఈ నెల 19వ తేదీన జరుగనుంది. ట్రస్టు బోర్డు సభ్యుడు, సుప్రీంకోర్టు లాయర్ కె.పరాశరన్ నివాసంలో జరిగే ఈ భేటీలో ఆలయ నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.