Ukrainian Plane Hijacked Row: విమానం హైజాక్ వార్తలు అబద్దం, ఖండించిన ఉక్రెయిన్, ఇంధనం కోసం మషాద్‌లో ఆగి తిరిగి ఉక్రెయిన్‌కు వెళ్లిందని తెలిపిన ఇరాన్ వైమానిక చీఫ్
కాగా ఉక్రేనియన్ జాతీయులను తరలించడానికి ఆఫ్ఘనిస్తాన్‌కు చేరుకున్న ఉక్రేనియన్ విమానం హైజాక్ (Ukrainian Evacuation Plane in Afghanistan) చేయబడిందని అనుమానాస్పద నివేదికలు ముందుగానే వెలువడ్డాయి.
Kiev, August 24: ఆఫ్ఘనిస్తాన్‌లో ఉక్రేనియన్ తరలింపు విమానాన్ని హైజాక్ చేసినట్లు వచ్చిన వార్తలను (Ukrainian plane Hijacked Row) ఉక్రెయిన్ ఇరాన్ విమానయాన అధిపతి ఖండించారు. కాగా ఉక్రేనియన్ జాతీయులను తరలించడానికి ఆఫ్ఘనిస్తాన్‌కు చేరుకున్న ఉక్రేనియన్ విమానం హైజాక్ (Ukrainian Evacuation Plane in Afghanistan) చేయబడిందని అనుమానాస్పద నివేదికలు ముందుగానే వెలువడ్డాయి.
విమానం ఇరాన్‌లోకి వెళ్లిన తరువాత గుర్తు తెలియని వ్యక్తులు హైజాక్ చేశారు' అని ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి యెవ్జెనీ యెనిన్ పేర్కొన్నట్లుగా వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఉక్రేనియన్ విమానం హైజాక్ చేయబడి ఇరాన్‌కు తరలించారన్న వార్తలను ఇరాన్ వైమానిక ప్రతినిధి తిరస్కరించారు. నిన్న రాత్రి ఉక్రెయిన్ విమానం ఇంధనం నింపడం కోసం మషాద్‌లో ఆగి ఉక్రెయిన్‌కు వెళ్లిందని ఇరాన్ వైమానిక చీఫ్ చెప్పారు. "ఇది ఇప్పుడు కీవ్‌లో ల్యాండ్ అయింది," అని ఆయన చెప్పినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
అంతకుముందు, వార్తా సంస్థ TASS, విమానం ఉక్రేనియన్ ప్రయాణీకులకు బదులుగా, గుర్తు తెలియని ప్రయాణీకుల బృందంతో ఇరాన్‌లోకి వెళ్లిందని నివేదించింది. మంత్రి ప్రకారం, హైజాకర్లు ఆయుధాలు కలిగి ఉన్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వం విమానాన్ని గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తుందా అని మంత్రి ప్రస్తావించలేదు. విమానంలో ఉక్రేనియన్ పౌరులుఎవరైనా ఉంటే ఎలా రక్షించబడతారు లేదా ఇంటికి తిరిగి తీసుకురాబడతారనే దానిపై అధికారిక సమాచారం లేదని పేర్కొన్నారు.
గత ఆదివారం మా విమానం కాబూల్ హైజాక్‌కు గురయ్యింది. మంగళవారం, విమానం ఆచరణాత్మకంగా మా నుంచి దొంగిలించబడింది. ఇక విమానంలో ఉక్రెయిన్లకు బదులుగా గుర్తు తెలియని ప్రయాణీకులు ఉన్నారు. 83 మంది ప్రయాణికుల బృందంతో విమానం ఇరాన్‌కు వెళ్లింది. మా తదుపరి మూడు తరలింపు ప్రయత్నాలు కూడా విజయవంతం కాలేదు. ఎందుకంటే మా ప్రజలు విమానాశ్రయంలోకి ప్రవేశించలేకపోయారు" అని ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి యెవ్జెనీ యెనిన్ రష్యన్ న్యూస్ ఏజెన్సీ టాస్‌తో పేర్కొన్నారు. అయితే తాజాగా ఈ వార్తలను ఉక్రేయిన్ ఖండించింది.
ఇక విమానం హైజాక్ వార్తలను ఇరాన్ ఖండించింది. కాబూల్ నుంచి విమానం వచ్చింది, రీఫ్యూయల్ చేసుకుని వెళ్లింది. ప్రస్తుతం మా భూభాగంలో ఉక్రెయిన్ విమానం లేదు అని ఇరాన్ స్పష్టం చేసింది. ఇలాఉండగా, ఆదివారం 31 మంది ఉక్రేనియన్లతో పాటు 83 మందితో కూడిన సైనిక రవాణా విమానం ఆఫ్ఘనిస్తాన్ నుంచి కీవ్‌కు చేరుకున్నది. 12 మంది ఉక్రేనియన్ మిలిటరీ సిబ్బంది స్వదేశానికి తిరిగి వచ్చారని, సహాయం కోరివచ్చిన విదేశీ జర్నలిస్టులు, వ్యక్తులను కూడా తరలించినట్లు ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. దాదాపు 100 మంది ఉక్రేనియన్లు ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్‌లోనే ఉండిపోయారు.