Russia-Ukraine War: రష్యా బాంబుల మోతతో దద్దరిల్లిన కీవ్, ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా బలగాలు, శత్రువు దాడి నుంచి తమ దేశాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా పోరాడుతున్న ఉక్రెయిన్‌ సైనికులు

ఉక్రెయిన్‌ దేశ రాజధాని కీవ్‌పై రష్యా బలగాలు మరోసారి విరుచుకుపడ్డాయి. రాజధాని ప్రాంతాన్ని చేజిక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి.

Russia-Ukraine War Representational image (Photo Credits: Twitter)

Kyiv, Dec 16: ఉక్రెయిన్-రష్యా యుద్దం ఇప్పట్లో ఆగేలా లేదు. ఉక్రెయిన్‌ దేశ రాజధాని కీవ్‌పై రష్యా బలగాలు మరోసారి విరుచుకుపడ్డాయి. రాజధాని ప్రాంతాన్ని చేజిక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. తాజాగా కీవ్‌ను లక్ష్యంగా చేసుకొని రష్యా భీకర దాడులు (Russia Launches Major Missile Attack) చేపట్టింది. శుక్రవారం తెల్లవారుజామున కీవ్‌ బాంబుల మోతతో (Explosion in Kyiv) దద్దరిల్లింది.

రష్యా (Russia) చర్యతో మౌలిక సదుపాయాలు దెబ్బతినడం వల్ల కీవ్‌లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని కీవ్‌ మేయర్‌ విటాలీ క్విచ్కో వెల్లడించారు. మెట్రో సర్వీస్‌లు నిలిపివేయడంతో స్టేషన్లను షెల్టర్స్‌గా వినియోగించుకోవాలని తెలిపారు.

ఉక్రెయిన్ వదిలి వెంటనే వెళ్లిపోండి, భారతీయులకు హెచ్చరికలు జారీ చేసిన ఇండియన్‌ ఎంబసీ, 4 నగరాల్లో మార్షల్‌ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన రష్యా

కీవ్‌లోని సెంట్రల్‌ జిల్లాలు, డెస్న్యాన్‌ జిల్లాలో పేలుళ్ల మోత వినిపించిందని, స్థానిక ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని పేర్కొన్నారు.రష్యా వరుస దాడుల దాడులతో ఉక్రెయిన్‌ విద్యుత్‌ నెట్‌వర్క్‌ ఇప్పటికే తీవ్రంగా దెబ్బతింది. విద్యుత్‌ అంతరాయం కారణంగా లక్షలాది ఉక్రెనియన్లు అంధకారంలో చిక్కుకుపోయారు. ఉక్రెయిన్ విద్యుత్, ఇంధన, మౌలిక సదుపాయాల వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని రష్యా ఈ దాడులు చేపట్టింది.

రష్యాకు G7 దేశాలు వార్నింగ్, ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) మొదలై ఇప్పటికే 10 నెలలు దాటిపోయింది. రష్యా కాల్సుల విరమణకు అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. రానున్న రోజుల్లో 2,00,000 బలగాలతో తమపై విరుచుకుపడేందుకు రష్యా వ్యూహం పన్నుతోందని ఉక్రెయిన్ (Ukraine) ఆర్మీ చీఫ్ జనరల్ వలేరియ్ జులుజ్నీ తెలిపారు. ది ఎకానమిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు మాట్లాడారు. తమకు మరిన్ని ఆయుధాలు, క్షిపణి వ్యవస్థలు కావాలన్నారు. రిజర్వ్ బలగాలను, అవసరమైతే పౌరులను కదన రంగంలోకి దించి రష్యా దాడులను తిప్పికొడతామని చెప్పారు.

రష్యా వెనక్కి తగ్గకపోవడంతో ఐరోపా సమాఖ్య మరోమారు ఆ దేశంపై ఆంక్షలు విధించింది. ఇలా చేయడం ఇది 9వ సారి కావడం గమనార్హం. ‍అలాగే రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు 18 బిలియన్ యూరోల ప్యాకేజీని సాయంగా అందించనున్నట్లు ప్రకటించింది. ఇక ఉక్రెయిన్‌కు యుద్ధంలో సాయం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని అమెరికాను రష్యా హెచ్చిరింది. అయితే అగ్రరాజ్యం మాత్రం మాస్కో వార్నింగ్‌ను లైట్ తీసుకుంది. ఉక్రెయిన్‌కు సాయం చేసి తీరతామని స్పష్టం చేసింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif