US Elections Results 2024: అమెరికా కాంగ్రెస్‌కు తొలిసారిగా ట్రాన్స్‌జెండర్‌, డెలవేర్‌ రాష్ట్రం నుంచి భారీ ఓట్లతో విజయం సాధించిన సారా మెక్‌బ్రైడ్‌

దీంతో కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు.

Sarah McBride To Be First Transgender Person In US Congress (Phoot-AFP)

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెలవేర్‌లోని ఎట్‌ లార్జ్‌ హౌస్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి డెమోక్రటిక్‌ అభ్యర్థిగా పోటీ చేసిన సారా మెక్‌బ్రైడ్‌ (Sarah McBride) విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. రిపబ్లికన్‌ పార్టీ (Republican Party) నుంచి జాన్‌ వేలెన్‌  IIIతో, సారా మెక్‌బ్రైడ్ పోటీపడ్డారు. సారాకు 95శాతం ఓట్లు పోలవగా.. వేలెన్‌కు 57.9 శాతం ఓట్లు పోలయ్యాయి. తాను కాంగ్రెస్‌లో చరిత్ర సృష్టించడానికి పోటీ పడలేదని డెలవేర్‌లో మార్పు కోసమే పోటీ చేసినట్లు సారా పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్ష పీఠాన్ని నిర్ణయించే కీలకమైన రెండు స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ విజయకేతనం, అమెరికా సెనెట్‌ని దక్కించుకున్న రిపబ్లికన్ పార్టీ, అగ్రరాజ్య పీఠానికి అడుగుదూరంలో డొనాల్డ్ ట్రంప్

సారా మెక్‌ బ్రైడ్‌ ఎల్‌జీబీటీక్యూ జాతీయ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో దాదాపు 3 మిలియన్లకుపైగా ప్రచార విరాళాలు సేకరించారు. 2016లో డెమోక్రటిక్‌ నేషనల్‌ కన్వెన్షన్‌లో ఒక ప్రధాన పార్టీ నిర్వహించిన సమావేశంలో ప్రసంగించిన మొదటి ట్రాన్స్‌జెండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2020లో డెలవేర్‌లో తొలి ట్రాన్స్‌ స్టేట్‌ సెనెటర్‌గా వ్యవహరించారు. 2010 నుంచి డెలవేరియన్‌ ఓటర్లు డెమోక్రట్‌లకే మద్దతిస్తున్నారు. ఈనేపథ్యంలో తాజా ఎన్నికల్లో (US Election Results) సారా మైక్‌బ్రైడ్‌ విజయం సాధించారు.

లింగమార్పిడి హక్కులు US ఎన్నికలలో హాట్-బటన్ సమస్యగా మారాయి -- పోటీ క్రీడలలో ట్రాన్స్ పీపుల్ పాల్గొనడం మరియు మైనర్లకు లింగ-ధృవీకరణ సంరక్షణకు ప్రాప్యత సమస్య తీవ్ర చర్చకు దారితీసింది.