Toxic Train Derailment: రైలు ప్రమాదంతో వణుకుతున్న అమెరికా, విషపూరిత వాయువులు గాలిలోకి, బాటిల్‌లోని నీటినే తాగాలని ప్రజలను హెచ్చరించిన ఓహియో గవర్నర్
ఇప్పుడు ఆ ప్రమాదం కారణంగా అత్యంత ప్రమాదకరమైన గ్యాస్‌లు వాతావరణంలో కలిశాయి.అక్కడ నీటిలో ఈ రసాయనాలు కలిసాయి. దీంతో అక్కడి ప్రజలు బాటిల్‌లోని నీటినే తాగాలని (Ohio Urged Not To Drink Water) ఆ రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ కోరారు.
Ohio, Feb 16: అమెరికాలోని ఒహియో ఇటీవల ఓ గూడ్స్ రైలు (Toxic Train Derailment) బోల్తాపడిన సంగతి విదితమే. ఇప్పుడు ఆ ప్రమాదం కారణంగా అత్యంత ప్రమాదకరమైన గ్యాస్‌లు వాతావరణంలో కలిశాయి.అక్కడ నీటిలో ఈ రసాయనాలు కలిసాయి. దీంతో అక్కడి ప్రజలు బాటిల్‌లోని నీటినే తాగాలని (Ohio Urged Not To Drink Water) ఆ రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ కోరారు. మధ్యపశ్చిమ యునైటెడ్ స్టేట్స్‌లో కార్గో రైలు పట్టాలు తప్పడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది.ఈ ప్రమాదం వినైల్ క్లోరైడ్ నుండి విషపూరిత పొగలను విడుదల చేసింది, US నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ క్యాన్సర్ కారకమని భావించిన.. రంగులేని వాయువు వాతావరణంలో కలిసిపోయింది.
ఒహైయో-పెన్సిల్వేనియా రాష్ట్రాల మధ్య ఈస్ట్ పాలస్టైన్ అనే గ్రామం వద్ద ఫిబ్రవరి 4వ తేదీన ఓ గూడ్స్ రైలు ప్రమాదానికి (cargo train derailment) గురైంది. దీంతో 50 బోగీలు పట్టాలు తప్పాయి. ఆ రైలులో అత్యంత ప్రమాదకరమైన వినైల్ క్లోరైడ్‌ను గ్యాస్‌ను తరలిస్తున్నారు. 150 బోగీలతో మాడిసన్ నుంచి బయల్దేరిన ఈ రైలు పెన్సిల్వేనియాలోని కాన్వేకు చేరుకోవాల్సి ఉంది. దీనిలో 11 బోగీల్లో వినైల్ క్లోరైడ్, బ్యూటైల్ అక్రలేట్ వంటి ప్రమాదకర కెమికల్స్‌ను తరలిస్తున్నాయి.
ప్రమాదం అనంతరం ఆ బోగీలు అగ్నికీలల్లో చిక్కుకొన్నాయి. ఈ గ్యాస్‌లో క్యాన్సర్ కారకాలు ఉంటాయని అమెరికా నేషనల్ క్యాన్సర్ సెంటర్ హెచ్చరించింది. దీంతో ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి దాదాపు ఒక మైలు దూరంపాటు గాల్లో చోటు చేసుకొంటున్న మార్పులను అమెరికా గమనిస్తోంది. దీంతోపాటు ఆ ప్రదేశంలో భూగర్భజలాలకు కూడా పరీక్షలు చేయిస్తోంది.
ఈ ఘటనపై ఆ రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ మాట్లాడుతూ ప్రస్తుతానికి అక్కడి బోర్లలో నీటిని తొలి విడత పరీక్షించగా.. ఎటువంటి ఇబ్బంది లేదని తేలినట్లు చెప్పారు. మరిన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందన్నారు. ప్రజలు అప్పటి వరకు బాటిల్ నీటినే వినియోగించాలని సూచించారు. మరోవైపు ఆ ప్రాంతానికి దగ్గర్లో ఉన్న నదులు, కాల్వల్లోని నీటిని సైతం పరీక్షల కోసం సేకరిస్తున్నారు.ఈ ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లోని వేల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. వారిని దాదాపు 5 రోజులపాటు అక్కడే ఉంచి తర్వాత ఇళ్లకు పంపారు.
దాదాపు 3,500 చేపలు 7.5 మైళ్లు (12 కిలోమీటర్లు) సమీపంలోని ప్రవాహాల వెంట చనిపోయాయని ఒహియో డిపార్ట్‌మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ నివేదించింది. నార్ఫోక్ సదరన్ జవాబుదారీగా ఉంటారని, "ప్రతిదానికీ చెల్లించాలి" అని డివైన్ చెప్పారు, తూర్పు పాలస్తీనాలోని కొంతమంది వ్యక్తులు క్లీనప్ పూర్తయ్యేలోపు కంపెనీ వెళ్లిపోతుందని ఆందోళన చెందుతున్నారు.చాలా విషపూరితమైన పదార్థాలతో సంభవించిన రైలు విధ్వంసానికి వారే బాధ్యత వహిస్తారు," అని డివైన్.. CNN కి చెప్పాడు. తరలింపుకు సంబంధించిన ఖర్చుల" కోసం కుటుంబాలు, వ్యాపారాలకు $1.5 మిలియన్లను అందించినట్లు నార్ఫోక్ సదరన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.