US Visa: అమెరికా వెళ్ళేవారికి గుడ్ న్యూస్, భారత్‌లో వీసా దరఖాస్తుల పరిష్కారానికి తీవ్ర కృషి, వివరాలను వెల్లడించిన అమెరికా విదేశాంగ శాఖ
భారత్‌లో వీసా దరఖాస్తులను వీలైనన్ని ఎక్కువ ప్రాసెస్ చేసేందుకు కాన్సులర్ బృందాలు భారీ ప్రయత్నం చేస్తున్నాయని, ఇది అమెరికా ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతగా ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఒక వార్తా సమావేశంలో తెలిపారు.
న్యూయార్క్, జూన్ 16: భారత్‌లో వీసా దరఖాస్తులను వీలైనన్ని ఎక్కువ ప్రాసెస్ చేసేందుకు కాన్సులర్ బృందాలు భారీ ప్రయత్నం చేస్తున్నాయని, ఇది అమెరికా ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతగా ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఒక వార్తా సమావేశంలో తెలిపారు.
ద్వైపాక్షిక సంబంధానికి కీలకమైన వీసా కేటగిరీలతో సహా భారతదేశంలో వీలైనన్ని వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి కాన్సులర్ బృందాలు భారీ ప్రయత్నం చేస్తున్నాయని మిల్లెర్ గురువారం భారతీయులు ఏమి ఆశించవచ్చు అనే ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ప్రధాని మోదీ త్వరలో అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వీసా సమస్యల పరిష్కారానికే తమ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. అయితే, ఈ విషయంలో చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని కూడా మాథ్యూ వ్యాఖ్యానించారు. భారత్‌తో అమెరికా భాగస్వామ్యం ఇరు దేశాలకు కీలకమని పేర్కొన్నారు. ఉమ్మడి లక్ష్యాల దిశగా అమెరికా, భారత్ కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. జూన్ 21-24 మధ్య భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే.
ఆ కేసుకి సహకరించకపోతే ఫేస్‌బుక్‌ను ఇండియాలో బ్యాన్ చేస్తాం, సంచలన వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హైకోర్టు
ఇది మోదీ తొలి అధికారిక అమెరికా పర్యటన. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ మోదీ కోసం అధికారిక విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు వీసాతో సహా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో భారత్ అమెరికా నుంచి 31 సాయుధ ప్రిడేటర్ డ్రోన్లు కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది.