Congo Volcano Eruption: ఒక్కసారిగా పేలిన అగ్నిపర్వతం, ఇళ్లను ముంచెత్తిన లావా, 32 మంది మృతి, రెండు రోజుల క్రితం మౌంట్ నైరాగోంగో అగ్నిపర్వత విస్ఫోటనం
ఈ ఘటనలో మృతుల సంఖ్య 32కు పెరిగింది. కాంగో దేశంలోని గోమాలో అగ్నిపర్వతం పేలడంతో (Volcano Eruption in DR Congo's) లావా ప్రవహించింది. గోమాకు ఉత్తరాన ఉన్న ప్రదేశంలో లావాను ( Goma evacuation) చల్లబరుస్తుండగా ఊపిరి ఆడక ఐదుగురు మరణించారు.
Kinshasa, May 24: కాంగోలోని గోమాలో అగ్నిపర్వతం (Congo Volcano Eruption) పేలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 32కు పెరిగింది. కాంగో దేశంలోని గోమాలో అగ్నిపర్వతం పేలడంతో (Volcano Eruption in DR Congo's) లావా ప్రవహించింది. గోమాకు ఉత్తరాన ఉన్న ప్రదేశంలో లావాను ( Goma evacuation) చల్లబరుస్తుండగా ఊపిరి ఆడక ఐదుగురు మరణించారు.
మరో వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరారని పౌర సమాజ నాయకుడు మాంబో కవాయ చెప్పారు. అగ్నిపర్వతం నుంచి ప్రవహించిన లావా ఇళ్లను ముంచెత్తడంతో 9 మంది దహనమయ్యారు. అగ్నిపర్వతం పేలడంతో గోమా జైలు నుంచి ఖైదీలను తరలిస్తుండగా ట్రక్కు బోల్తా పడి 14మంది దుర్మరణం చెందారు. కాంగో దేశ అధికారులు సహాయ పునరావాస పనులు చేపట్టారు.
తూర్పు కాంగోలోని గోమా శివార్లలో రెండు రోజుల క్రితం మౌంట్ నైరాగోంగో అగ్నిపర్వత విస్ఫోటనం సంభవించింది. ఈ పేలుడు దెబ్బకు వెదజల్లిన లావా గ్రామంలోని 500కి పైగా గృహాలను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 32కి పెరిగింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని ఉత్తర కివు ప్రావిన్స్ సివిల్ ప్రొటెక్షన్ హెడ్ జోసెఫ్ మకుండి తెలిపారు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు డజనుకు పైగా ప్రజలు కారు ప్రమాదాల్లో మరణించారు. కాంగో ఆరోగ్య మంత్రితో సహా ప్రభుత్వ మంత్రుల ప్రతినిధి బృందం గోమాకు చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
సుమారు 2 మిలియన్ల జనాభా కలిగిన గోమా శివారులో అగ్నిపర్వతం జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో సుమారు 5,000 మంది ప్రజలు సమీప సరిహద్దు మీదుగా రువాండాలోకి పారిపోయారు. మరో 25 వేల మంది సాకేలో వాయువ్య దిశలో ఆశ్రయం పొందారని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి ఒకరు తెలిపారు.