Arshdeep Dalla Arrested: కెన‌డాలో మోస్ట్ వాంటెడ్ ఖలిస్థానీ ఉగ్ర‌వాది అరెస్ట్, నిజ్జ‌ర్ కు అత్యంత స‌న్నిహితుడ్ని అదుపులోకి తీసుకున్న కెన‌డా పోలీసులు

భారత భద్రతా సంస్థలు కూడా అర్ష్‌ డల్లా అరెస్ట్‌ను ధృవీకరించాయి.

Arsh Dalla (Photo Credit: X/@cozyduke_apt29)

Canada, NOV 10: ఖలిస్థానీ ఉగ్రవాది, భారత్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకడైన అర్ష్ డల్లా (Khalistani terrorist Arsh Dalla) అలియాస్‌ అర్ష్‌దీప్ సింగ్‌ను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబరు 27న మిల్టన్ పట్టణంలో జరిగిన కాల్పుల సంఘటనలో అతడి పాత్ర ఉందన్న అనుమానంతో అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. భారత భద్రతా సంస్థలు కూడా అర్ష్‌ డల్లా అరెస్ట్‌ను ధృవీకరించాయి. కాగా, పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన అర్ష్‌ డల్లా రాష్ట్రాంలో అనేక హత్యలు, నేరాలకు పాల్పడ్డాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కాంగ్రెస్ నేత బల్జీందర్ సింగ్ బల్లి హత్యకు బాధ్యత వహించాడు. బల్జిందర్ సింగ్ తన భవిష్యత్తును నాశనం చేశాడని, తనను గ్యాంగ్‌స్టర్ల ప్రపంచంలోకి నెట్టాడని డల్లా ఆరోపించాడు. తన తల్లి పోలీసు కస్టడీ వెనుక ఆ కాంగ్రెస్ నేత హస్తం ఉందని, అందుకే ప్రతీకారం తీర్చుకున్నట్లు ఒక పోస్ట్‌లో పేర్కొన్నాడు.'

US Presidential Election 2024: డొనాల్డ్ ట్రంప్‌ని అభినందిస్తూ ప్రధాని మోదీ పెట్టిన పోస్టుకి 20 మిల్లియన్ల వ్యూస్, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచిన ట్వీట్ 

మరోవైపు భారత్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ అయిన అర్ష్‌ డల్లా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) జారీ చేసిన తీవ్రవాదుల జాబితాలో కూడా ఉన్నాడు. భారత్‌లో పలు నేర కార్యకలాపాలకు పాల్పడుతున్న అతడు తన భార్యతో కలిసి కెనడాలో నివసిస్తున్నాడు. హతమైన ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ వారసుడైన అర్ష్‌ డల్లా, ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ తాత్కాలిక చీఫ్‌గా వ్యవహరిస్తున్నాడు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif