Marburg Virus: కరోనా కన్నా డేంజరస్ వైరస్ మళ్లీ పుట్టుకొచ్చింది, ఆఫ్రికాలో బయటపడిన మార్బర్గ్ వైరస్, ఇప్పటికే ఇద్దరు మృతి, వైరస్ సోకిన రెండు నుంచి 21 రోజుల్లో లక్షణాలు బయటకు
ఆఫ్రికాలోని ఘనాలో మరో ప్రాణాంతక వైరస్ మార్బర్గ్ వైరస్‌ను కనుగొన్నారు.
ఇప్పటికే ప్రపంచ దేశాలు ఎబోలా, కరోనా, మంకీపాక్స్ వంటి వ్యాధులతో అల్లాడుతుంటే మరో కొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఆఫ్రికాలోని ఘనాలో మరో ప్రాణాంతక వైరస్ మార్బర్గ్ వైరస్‌ను కనుగొన్నారు. రెండు వారాల క్రితం ఈ వైరస్ సోకిన ఇద్దరు బాధితులు తాజాగా మరణించారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ధ్రువీకరించింది. ఎబోలా కుటుంబానికి చెందినదే మార్బర్గ్ వైరస్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. భారత్‌లో తగ్గని కరోనా తీవ్రత, ఫోర్త్ వేవ్ దిశగా కరోనా కేసులు, నిన్న ఒక్కరోజే 18వేలకు పైగా కేసులు నమోదు, భారీగా పెరిగిన యాక్టీవ్ కేసుల సంఖ్య
ఈ వ్యాధి కూడా గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వైరస్ సోకిన జంతువులు/మనుషుల స్రావాలను నేరుగా తాకడం వల్ల సంక్రమిస్తుంది. వైరస్ సోకిన రెండు నుంచి 21 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. జ్వరం, రక్త విరేచనాలు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, శరీరంలో అంతర్గత రక్తస్రావం, కండ్లు ఎర్రబడటం, మూత్రంలో రక్తం, తలనొప్పి, ఆయాసం వంటివి లక్షణాలుగా ఉంటాయి. మరణాల రేటు 88 శాతం వరకూ ఉంటుంది.