Trump to Visit India: ఫిబ్రవరి నెల చివర్లో భారత్‌లో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ పర్యటనతో భారత్- యూస్ మధ్య వ్యూహాత్మక బంధం బలపడుతుందని భారత్ ఆకాంక్ష

అమెరికా అధ్యక్షుడు భారత్ లో పర్యటించడం వరుసగా ఇది మూడోసారి అని ఆఘీ గుర్తుచేశారు. అంతకుముందు....

Narendra Modi and Donald Trump File Photo. |(Photo Credits: ANI)

Washington, Feb 11:  అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత పర్యటన (India Tour) ఖరారైంది. ఈనెల చివర్లో ఆయన రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 24 మరియు 25 తేదీల్లో డొనాల్డ్ ట్రంప్ మరియు ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ అయిన మెలానియా ట్రంప్‌తో కలిసి న్యూఢిల్లీ మరియు అహ్మదాబాద్‌లలో పర్యటిస్తారని వైట్ హౌస్ (White House) మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

ట్రంప్ పర్యటనకు సంబంధించి గతవారం ప్రధాని మోదీ (Narendra Modi)  మరియు ట్రంప్ తో ఫోన్ కాల్ ద్వారా చర్చించారు. ఈ పర్యటన భారత్ మరియు యూఎస్ (India- USA) మధ్య వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేస్తుందని మరియు ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని భారత్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది.

కాగా, ట్రంప్ భారత పర్యటన ఎంతో కీలకమైందని యూఎస్-ఇండియా స్ట్రాటీజిక్ అండ్ పార్టనర్‌షిప్ ఫోరం అధ్యక్షుడు ముఖేష్ అఘీ పేర్కొన్నారు. ఈ పర్యటన ద్వారా అమెరికాకు భారత్ ఒక ప్రాధాన్యమైన భాగస్వామి అని ప్రపంచానికి సందేశం పంపినట్లవుతుందని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు భారత్‌లో పర్యటించడం వరుసగా ఇది మూడోసారి అని ఆఘీ గుర్తుచేశారు. అంతకుముందు బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడి హోదాలో 2010 మరియు 2015లో రెండు సార్లు భారత్‌లో పర్యటించారు.

ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య నెలకొన్న ద్వైపాక్షిక వాణిజ్య సమస్యలు పరిష్కారం అవుతాయని, కీలక వాణిజ్య ఒప్పందాలు జరిగే అవకాశం ఉంటుందని పారిశ్రామిక వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి.

కాగా, ట్రంప్ భారత్‌ను సందర్శించదం ఇదే తొలిసారి. అంతకుముందు రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరు కావాలని ట్రంప్‌ను భారత్ ఆహ్వానించినప్పటికీ, షెడ్యూల్ కుదరకపోవడం వల్ల ఆయన పర్యటన వీలుపడలేదు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif