WHO Team to Visit China: కరోనావైరస్ చైనాలోనే పుట్టిందా? నిజాలను నిగ్గు తేల్చేందుకు రెడీ అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, 10 మందితో కూడిన బృందం ఈ నెల 14వ తేదీన చైనాకు..
చైనా ప్రభుత్వం (China Govt) ఉద్దేశపూర్వకంగా ఈ వైరస్‌ను సృష్టించి, ప్రపంచం పైకి వదిలిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఈ వైరస్ నిజంగా చైనాలో (China) పుట్టిందా లేదా అనే విషయం తేల్చడానికి 10 మంది నిపుణులతో కూడిన ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం ఈ నెల 14వ తేదీన చైనాకు (WHO Team to Visit China) చేరుకోనుంది.
Beijing, Jan 12: ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక కరోనావైరస్ చైనాలోనే పుట్టిందని ప్రపంచవ్యాప్తంగా అందరూ నమ్ముతున్న సంగతి విదితమే. చైనా ప్రభుత్వం (China Govt) ఉద్దేశపూర్వకంగా ఈ వైరస్‌ను సృష్టించి, ప్రపంచం పైకి వదిలిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఈ వైరస్ నిజంగా చైనాలో (China) పుట్టిందా లేదా అనే విషయం తేల్చడానికి 10 మంది నిపుణులతో కూడిన ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం ఈ నెల 14వ తేదీన చైనాకు (WHO Team to Visit China) చేరుకోనుంది.
ఈ విషయాన్ని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ సోమవారం స్వయంగా వెల్లడించారు. కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తి మార్గాన్ని కనిపెట్టే విషయంలో సైంటిస్టులకు పూర్తిగా సహకరిస్తామని అన్నారు. కాగా తమ దేశంలోకి డబ్ల్యూహెచ్‌ఓ (World Health Organization) బృందాన్ని అనుమతించకుండా చైనా మొండికేసిన సంగతి తెలిసిందే. నిపుణుల బృందం 14న చైనాలో క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. వైరస్‌కు మూలమని చాలామంది భావిస్తున్న వూహాన్ మార్కెట్‌ను సందర్శించనుంది.
ఇదిలా ఉంటే వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (WIV)లో కరోనా వైరస్‌ను సృష్టించారని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీని సందర్శిస్తుందా? లేదా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ సందర్శిస్తే వైరస్‌కు (Coronavirus) సంబంధించిన కీలక వివరాలు బయట పడే అవకాముందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.