Volodymyr Zelensky Biography: ఉక్రెయిన్ అధ్యక్షుడికి సంబంధంచిన ఈ విషయాలు తెలుసా? కమెడియన్ నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడి వరకు ప్రస్థానం ఇదీ! జెలెన్‌ స్కీ లైఫ్ స్టోరీలో కీలకమైన మైలురాళ్లు ఇవే

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు (Russia war) దిగిన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీగా ముందుగా వచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ భయంతో దేశం విడిచి పారిపోకుండా దేశ పౌరులతో పాటుగా ఉక్రెయిన్ ఆర్మీలో ధైర్యాన్ని నింపారు. నేను ఉన్నా.. మనదేశాన్ని మనం కాపాడుకుందాం.. అంటూ ముందుకు నడిపిస్తున్నారు.

Ukrainian President Volodymyr Zelensky

Ukraine, Feb 27: ప్రపంచానికి ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Volodymyr Zelensky)గానే తెలుసు.. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు (Russia war) దిగిన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీగా ముందుగా వచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ భయంతో దేశం విడిచి పారిపోకుండా దేశ పౌరులతో పాటుగా ఉక్రెయిన్ ఆర్మీలో ధైర్యాన్ని నింపారు. నేను ఉన్నా.. మనదేశాన్ని మనం కాపాడుకుందాం.. అంటూ ముందుకు నడిపిస్తున్నారు. ఒకవైపు శాంతికోసం చర్చల ప్రతిపాదనలు చేస్తూనే మరోవైపు రష్యాతో ఒంటరి పోరాటం చేస్తున్నారు. రష్యా (Russia) దురాక్రమణ నుంచి ఆదుకుంటాయనుకున్న నాటో ప్రపంచ దేశాలు చేతులేత్తేయడంతో యుక్రెయిన్ కీవ్ నగరాన్ని ఆక్రమించేందుకు దూసుకొస్తున్న రష్యా బలగాలను దేశ బలగాలతో దీటుగా తిప్పికొడుతున్నారు. దేశం విడిచి పారిపోకుండా నిలబడిన అధ్యక్షుడిగా జెలెన్ స్కీ ప్రశంసలు అందుకుంటున్నారు. ‘నేను రష్యా బలగాల బారినుంచి తప్పించుకుని దాక్కోవడం కాదు.. నేను పారిపోతే నా దేశాన్ని కాపాడుకునేది ఎలా’ అంటూ అలానే రష్యా బలగాలకు ఎదురు నిలబడ్డారు.

గత ఏడాదిలో కాబూల్‌ను తాలిబాన్ (Taliban) స్వాధీనం చేసుకున్నప్పుడు అప్ఘానిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో దేశాన్ని విడిచి పారిపోయారు. అయితే అదే తరహాలో జెలెన్ స్కీ కూడా దేశాన్ని ఖాళీ చేయమని యునైటెడ్ స్టేట్స్ చేసిన ప్రతిపాదనను ఆయన తిరస్కరించాడు. నేను ఎక్కడికి పారిపోను.. నా దేశాన్ని రక్షించుకోవాలంటే ముందు నాకు ఆయుధాలు కావాలి అంటూ అధ్యక్షుడు చెప్పిన మాటలు ప్రతిఒక్కరి హృదయాలను చలించిపోయేలా చేశాయి.. అందరి హృదయాలను గెలిచిన ఈ జెలెన్ స్కీ(Zelensky).. యుక్రెయిన్ అధ్యక్షుడు కాకముందు ఆయన గురించి తెలియని ఓ పది విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Indians in Ukraine: భారతీయులు జాగ్రత్తగా ఉండండి, ఎవ‌రూ ఏ దేశ స‌రిహ‌ద్దుల వైపు వెళ్లొద్ద‌ు, హెచ్చరించిన ఉక్రెయిన్‌ ఎంబ‌సీ అధికారులు, ఉక్రెయిన్ నుంచి వ‌చ్చే విద్యార్థుల‌కు ముంబై ఎయిర్ పోర్టులో ఆర్టీపీసీఆర్ టెస్టులు

జెలెన్‌స్కీ గురించి తెలుసుకోవాల్సిన 10 విషయాలు ఇవే..

1. జెలెన్ స్కీ.. రష్యన్ మాట్లాడే యూదు(Jewish)కు చెందినవాడు. ఆయన తన కామెడీ టీవీ షోతో పాపులర్ అయ్యారు.

2. జెలెన్ స్కీ.. తాత రెండవ ప్రపంచ యుద్ధంలో రెడ్ ఆర్మీలో పనిచేశాడు. ‘మేము నాజీల (Nazis)మని చెబుతారు. కానీ, నాజీయిజంపై విజయం కోసం 8 మిలియన్లకు పైగా ప్రాణాలను అర్పించిన నాజీలను ప్రజలు ఎలా ఆదరిస్తారు? నేను నాజీని ఎలా అవుతాను? ఆయన ఇటీవల ఓ సందర్భంలో అన్నారు. సోవియట్ సైన్యం పదాతిదళంలో ఆయన తాత స్వతంత్ర యుక్రెయిన్‌ కోసం జరిగిన యుద్ధంలో కల్నల్‌గా మరణించారు.

3. జెలెన్ స్కీ.. లా డిగ్రీ పొందారు. కానీ ఆయన ఆ రంగంలో ఎప్పుడూ పని చేయలేదు.

4. జెలెన్ స్కీ అనుకోకుండా అధ్యక్షుడిగా 2019 ఎన్నికలలో ఎన్నికయ్యారు. కానీ, ఆయన ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించిన తర్వాత.. ఒపీనియన్ పోల్‌లో జెలెన్ స్కీ ముందంజలో నిలిచారు.

5. రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు.. జెలెన్‌స్కీ.. ఒక నటుడు, హాస్యనటుడుగా సుపరిచితమే.. ఆయనకు ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉంది. ప్రముఖ టీవీ షో సర్వెంట్ ఆఫ్ ది పీపుల్ జెలెన్ స్కీను ఈయనే నిర్వహించేవారు. అంతేకాదు.. ఒక పాఠశాల ఉపాధ్యాయుడిగా కూడా జెలెన్ స్కీ పనిచేశారు. ఆయన గంభీరమైన వాక్చాతుర్యం కలిగి ఉండటంతో ఉక్రెయిన్ అధ్యక్షుడయ్యాడు.

6. జెలెన్ స్కీ.. 2019 ఎన్నికలలో 73శాతం ఓట్లతో గెలిచారు.

7. గతంలో Volodymyr Zelensky అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. Pandora Papersలో కూడా ఆయన పేరు చేర్చారు. తన నిర్మాణ సంస్థ ఆఫ్‌షోర్ షెల్ కంపెనీలతో ముడిపడి ఉన్నాయనే అభియోగాలను మోపారు.

8. తన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ రష్యాతో వివాదాన్ని ముగింపు పలికేందుకు ఎప్పుడూ సిద్ధమేనని జెలెన్ స్కీ అన్నారు.

9. జెలెన్స్కీ అధ్యక్షుడు అయ్యాక.. ఆయన్ను యుక్రేనియన్ డొనాల్డ్ ట్రంప్ అని పిలిచేవారు.. ఎందుకంటే.. వీరిద్దరికి ఎంటర్ టైన్మెంట్ రంగంతో సంబంధం కలిగి ఉండటమే కారణం.

10. 2003లో ఒలెనా జెలెన్స్కాతో జెలెన్స్కీకి వివాహం జరిగింది.. జెలెన్స్కీకి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Russia-Ukraine War: సాయం అందించండి, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఫోన్ చేసిన ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ

యుక్రెయిన్ సంక్షోభం సమయంలోనే జెలెన్ స్కీ వార్తల్లోకెక్కారు. రష్యా యుక్రెయిన్‌పై దాడికి దిగడంతో యుక్రేనియన్లను ఉద్దేశించి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి మరింత సుపరిచితులయ్యారు. పేలుళ్ల శబ్దాల మధ్య ఓ సెల్ఫీ-స్టైల్ వీడియోను కూడా విడుదల చేశారు. తాను ఎక్కడికి వెళ్లలేదని, ఇంకా కైవ్‌లో ఉన్నానని, ఎప్పటికి అలాగే ఉంటానని చెప్పారు. ఇది మన భూమి, మన దేశం, మన బిడ్డలు, మనమే కాపాడుకుందామని జెలెన్ స్కీ చెప్పిన మాటలు యావత్తూ ప్రపంచాన్ని కదిలించాయి.