Will Smith Banned From Oscars: విల్ స్మిత్‌పై పదేళ్లపాటూ నిషేదం, ఆస్కార్ వేడుకల్లో ప్రవర్తనకు భారీ మూల్యం, అస్కార్ సహా అకాడమీ అవార్డుల వేడుకల్లోనూ పాల్గొనకుండా బ్యాన్, మోషన్ పిక్చర్స్ నిర్ణయాన్ని స్వాగతించిన స్మిత్
ఇతర అకాడమీ అవార్డుల వేడుకల్లోనూ పాల్గొనకుండా పదేళ్లపాటు నిషేధం (Banned From Oscars For 10 Years) విధించారు. ఆస్కార్ వేడుకలో (Oscar Ceremony) విల్ స్మిత్ వ్యవహారించిన శైలిని మోషన్ పిక్చర్ అకాడమీ తప్పుపట్టింది.
Los Angeles, April 09: ప్రముఖ నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత విల్ స్మిత్‌పై (Will Smith) మోషన్ పిక్చర్ అకాడమీ (Motion Picture) చర్యలు తీసుకుంది. పదేళ్లపాటు ఆస్కార్ అవార్డు వేడుకల్లో (Oscars) పాల్గొనకుండా విల్ స్మిత్‌పై నిషేధం విధించింది. ఇతర అకాడమీ అవార్డుల వేడుకల్లోనూ పాల్గొనకుండా పదేళ్లపాటు నిషేధం (Banned From Oscars For 10 Years) విధించారు. ఆస్కార్ వేడుకలో (Oscar Ceremony) విల్ స్మిత్ వ్యవహారించిన శైలిని మోషన్ పిక్చర్ అకాడమీ తప్పుపట్టింది. అస్కార్ అవార్డుల వేడుకలో తన భార్యపై కామెంట్ చేసినందుకు విల్ స్మిత్ వేదికపైనే కమెడియన్ క్రిస్ రాక్‌ను (Chris Rock) కొట్టిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై స్మిత్ స్పందించారు. అకాడమీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపారు.
లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఆస్కార్ వేడుకల్లో వ్యాఖ్యాత క్రిస్ రాక్‌పై (Chris Rock) విల్ స్మిత్ చేయిచేసుకున్నాడు. అయితే అది తనను ఎంతో బాధించిందని, తాన ప్రవర్తన క్షమించరానిదని చెప్పాడు. ఈ నేపథ్యంలో తాను మోషన్ పిక్చర్ అకాడమీకి రాజీనామా చేస్తున్నానని, బోర్డు ఎలాంటి శిక్ష వేసినా దానికి తాను అంగీకరిస్తానన్నాడు. ఆస్కార్ వేడుకలో తాను ప్రవర్తించిన విధానం షాకింగ్‌గా, బాధాకరంగా ఉందని విల్ స్మిత్ (Will Smith) ప్రకటించాడు. అందుకే అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని తెలిపాడు. బోర్డు సభ్యులు తీసుకునే ఎలాంటి చర్యలకైనా సిద్ధంగా ఉన్నానని, ఎలాంటి శిక్షలు వేసినా వాటన్నింటినీ అంగీకరిస్తానని ఆ రోజే స్పష్టం చేశాడు. అకాడమీ అవార్డుల వేడుకలో తన ప్రవర్తన క్షమించరానిదన్నాడు.
94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవా కార్యక్రమంలో ప్రముఖ కమెడియన్ క్రిస్ రాక్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఈ సందర్భంగా ఓ కామెడీ ట్రాక్‌ను చెబుతూ అందులో విల్ స్మిత్ భార్య జాడా పింకెట్‌పై (Jada Pinkett ) కామెంట్ చేశారు. అలోపేసియా (alopecia) అనే అనారోగ్య సమస్య కారణంగా జాడా పూర్తిగా గుండుతో కన్పించడంతో.. క్రిస్ రాక్ ఆమెను జీ.ఐ.జేన్ చిత్రంలో డెమి మూర్ పోషించిన పాత్రతో పోల్చాడు. ఆ పాత్రలో డెమి మూర్ కూడా గుండుతో కనిపించింది. అయితే అతడి వ్యాఖ్యలను స్మిత్ తొలుత సరదాగా తీసుకున్నట్లు కనిపించినా.. ఆ తర్వాత నేరుగా వేదికపై వెళ్లి క్రిస్‌ను చెంపదెబ్బ కొట్టాడు. తర్వాత కొద్దిసేపటికి ఉత్తమ నటుడిగా విల్ స్మిత్ ఆస్కార్ అందుకున్నాడు. అయితే ఈ ఘటనపై వేదికపైనే స్పందించిన స్మిత్ అకాడమీకి, సహచరులకు క్షమాపణలు తెలిపారు. ఆ మరుసటి రోజు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బహిరంగా క్షమాపణలు కోరాడు. తన భార్యపై జోకులు వేయడాన్ని భరించలేకే అలా చేశానని వెల్లడించాడు.