అమెరికాలోని లాస్ ఎంజెల్స్‌లో 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ (94th Academy Awards) కార్యక్రమం మార్చి 27న ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ నటుడు విల్ స్మిత్, కింగ్ రిచర్డ్ అనే సినిమాకిగానూ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నాడు. అయితే ఈ షోలోనే స్టేజ్ మీద మరో నటుడు, షో హోస్ట్‌ని ఈ యాక్టర్ (Will Smith And Chris Rock) కొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజేతని ప్రకటించడానికి ముందు హోస్ట్ కమెడియన్ అక్కడే ఉన్న విల్‌స్మిత్‌ని చూస్తూ ఆయన భార్య జడా పింకెట్ స్మిత్‌ని ఓ హాలీవుడ్ సినిమాలోని క్యారెక్టర్‌తో పోల్చుతూ జోక్ చేశాడు.

జీ.ఐ.జెన్’ చిత్రంలో ఓ పాత్ర పూర్తిగా గుండుతో ఉంటుంది. అచ్చం అలాగే పింకెట్ స్మిత్ కూడా గుండుతో ఉంటుంది. అయితే.. దీనికి కారణంగా ఆమెకి ఉన్న ‘అలోపెసియా’ అనే వ్యాధి. అది ఉన్న వారికి జుట్టు ఊడిపోతుంటుంది. దీంతో పింకెట్‌ని ఆ పాత్రతో పోల్చడమే కాకుండా ఈ సినిమా సీక్వెల్ తనని చూడాలనుకుంటున్నట్లు జోక్ చేశాడు. ఇది విల్ స్మిత్ కోపానికి కారణమైంది. దీంతో స్జేజ్ పైకి వెళ్లి క్రిస్ చెంప మీద గట్టిగా కొట్టాడు. నీ నోటి నుంచి నా భార్య పేరు బయటికి వస్తే మంచిగుండదు’ అంటూ కోపంగా స్మిత్ అరిచాడు. దీంతో ఏం చేయాలో తెలియని క్రిస్ చూస్తూ ఉండిపోయాడు. అయితే.. వైరల్‌గా మారిన ఈ వీడియోపై ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది. అనంతరం బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న స్మిత్ మాట్లాడుతూ కమెడియన్‌కి క్షమాపణలు తెలిపాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)