ఆర్ఆర్ఆర్ సినిమా ( RRR Movie ) చరిత్ర సృష్టించింది. భారతీయ సినిమాకు కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డు( Oscars 2023 )ను గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ అకాడమీ అవార్డు అందుకుంది. ఇంత గొప్ప పాట ఎలా రాశారని మీడియా అడిగిన ప్రశ్నకు పాటల రచయిత చంద్రబోస్ ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. తెలుగులో 56 అక్షరాలు ఉంటాయని తెలిపారు.

తెలుగు భాషలో చాలా అక్షరాలు, చాలా ఫీలింగ్స్, చాలా ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయని.. అందుకే ఇది గొప్ప భాష అని చెప్పారు. తెలుగు సాహిత్య భాష.. సంగీత భాష అని ఆయన స్పష్టం చేశారు. తెలుగులో మామూలు ఒక్క పదం రాసినా కూడా అందులో సంగీతం ప్రతిధ్వనిస్తోందని తెలిపారు. తెలుగు వాళ్లకు సాహిత్యం అర్థమవుతుంది కాబట్టి ఇష్టపడతారు.. కానీ భాషతో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడతున్నారంటే దానికి ఆ పాటలోని పదాల వెనుక ఉన్న సంగీతమే కారణమని స్పష్టం చేశారు.

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)