William Shakespeare Dies: ప్రపంచంలొ కరోనా టీకా తీసుకున్నతొలి వ్యక్తి విలియం షేక్‌స్పియర్ కన్నుమూత, వ్యాక్సిన్‌తో సంబంధంలేని అనారోగ్య సమస్యలతో మృతి
వ్యాక్సిన్‌తో సంబంధంలేని అనారోగ్య సమస్యలతో ఆయన మృతిచెందినట్టు బ్రిటిష్ మీడియా వెల్లడించింది.
London, May 25: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కోవిడ్–19 టీకా తీసుకున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించిన విలియం షేక్‌స్పియర్(81) సోమవారం (William Shakespeare Dies) కన్నుమూశారు. వ్యాక్సిన్‌తో సంబంధంలేని అనారోగ్య సమస్యలతో ఆయన మృతిచెందినట్టు బ్రిటిష్ మీడియా వెల్లడించింది. గతేడాది డిసెంబర్ 8న ఆయన ఫైజర్ టీకా (First Man in World to Get COVID-19 Jab) తీసుకున్నారు. ఆయన కంటే ముందు 91 ఏండ్ల మహిళ మార్గరేట్ కీనన్ కరోనా టీకా తీసుకుని రికార్డు సృష్టించారు.
కాగా యూనివర్సిటీ హాస్పిటల్ కోవెంట్రీ, వారి్వక్‌షైర్‌లో గత ఏడాది డిసెంబర్ 8న మొట్టమొదటి ఫైజర్ టీకా డోస్ తీసుకున్న పురుషునిగా షేక్‌స్పియర్ రికార్డు నెలకొల్పారు. అంతకుముందు, అదే ఆస్పత్రిలో మార్గరెట్ కీనన్(91)కోవిడ్ టీకా తీసుకుని, మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. కోవిడ్‌యేతర రుగ్మతలతో అదే ఆస్పత్రిలో చేరిన షేక్‌స్పియర్ ఈనెల 20న కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారని బీబీసీ తెలిపింది.
కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించి అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంటోని ఫౌసీ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు కరోనా వైరస్ సహజంగా అభివృద్ధి చెందింది అనే వాదనతో తాను ఏకీభవించనని పేర్కొన్నారు. యునైటెడ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ అమెరికా పేరిట ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కోవిడ్ వ్యాప్తికి దారి తీసిన పరిస్థితులు, అలాగే చైనాలో వైరస్‌కు సంబంధించి అసలు ఏం జరిగిందనే దానిపై నిజాలు వెల్లడయ్యే వరకూ పరిశోధనలు జరపాలని అన్నారు.
జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకిందని పరిశోధకులు చెప్తున్నప్పటికీ వైరస్ పుట్టుక, వ్యాప్తికి ఇంకేదో కారణాలు ఉండవచ్చని ఆయన అన్నారు. మనం దాన్ని మనం కనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పౌసీ అన్నారు. చైనాలో ఏం జరిగిందనేది గుర్తించేందుకు తదుపరి పరిశోధనల పట్ల తాను పూర్తి సానుకూలంగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. కాగా గత సంవత్సరం డాక్టర్ ఫౌసీ ప్రపంచవ్యాప్తంగా 165 మిలియన్ల మందికి పైగా ఈ మహమ్మారి సోకి, 3.5 మిలియన్లకు పైగా ప్రజలు మరణించారని వార్తపై సానుకూలంగా స్పందించలేదు. ఈ వైరస్ జన్యుపరంగా తయారు చేసిందని చైనాలోని వుహాన్ ప్రయోగశాల నుంచి బయటకు వచ్చిందనే వాదనను కూడా అప్పట్లో తోసిపుచ్చారు. ప్రస్తుతం యూటర్న్ తీసుకోవడం విశేషం.