Russia COVID-19 Vaccine: కరోనాకి రష్యా వ్యాక్సిన్ చెక్, పుతిన్ కూతురుకి తొలి వ్యాక్సిన్, ప్రపంచంలోనే తొలి కోవిడ్-19 వైరస్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని తెలిపిన రష్యా అధ్యక్షుడు
ప్రపంచంలోనే తొలి కోవిడ్-19 వ్యాక్సిన్‌ను (World's First COVID-19 Vaccine) అభివృద్ధి చేశామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ (Vladimir Putin) ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా నిరోధించే వ్యాధి నిరోధకతను కలిగిఉందని వ్యాక్సిన్‌ను (Russia COVID-19 Vaccine) ప్రారంభిస్తూ ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే తొలి కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను మంగళవారం ఉదయం రష్యా నమోదు చేసిందని మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పుతిన్ వెల్లడించారు. వ్యాక్సిన్ పనితీరుపై తనకు సమాచారం అందించాలని ఆరోగ్య మంత్రి మైఖేల్ మురష్కోను ఆయన కోరారు.
Moscow, August 11: ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 కల్లోలం రేపుతున్న నేపథ్యంలో రష్యా తీపి కబురు అందించింది. ప్రపంచంలోనే తొలి కోవిడ్-19 వ్యాక్సిన్‌ను (World's First COVID-19 Vaccine) అభివృద్ధి చేశామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ (Vladimir Putin) ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా నిరోధించే వ్యాధి నిరోధకతను కలిగిఉందని వ్యాక్సిన్‌ను (Russia COVID-19 Vaccine) ప్రారంభిస్తూ ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే తొలి కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను మంగళవారం ఉదయం రష్యా నమోదు చేసిందని మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పుతిన్ వెల్లడించారు. వ్యాక్సిన్ పనితీరుపై తనకు సమాచారం అందించాలని ఆరోగ్య మంత్రి మైఖేల్ మురష్కోను ఆయన కోరారు.
ఇక తొలి వ్యాక్సిన్ ను తన ఇద్దరి కూతుర్లలో ఒకరికి ఇచ్చినట్లు రష్యా అధినేత ప్రకటించారు. కరోనా వైరస్ సోకిన తన కూతురికి ఆ టీకాను ఇచ్చినట్లు పుతిన్ వెల్లడించారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత తన కూతురి శరీరంలో స్వల్పలంగా ఉష్ణోగ్రతలు పెరిగినట్లు అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. కానీ త్వరగానే తన కూతురు సాధారణ స్థాయికి వచ్చిట్లు తెలిపారు. టీకా ప్రయోగంలో భాగంగా తన కూతురు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. తొలిసారి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత తన కూతురి టెంపరేచర్ 38గా నమోదు అయ్యిందని, తర్వాత రోజు టెంపరేచర్ 37కు పడిపోయినట్లు రష్యా అధ్యక్షుడు తెలిపారు. రష్యా కొవిడ్-19 వ్యాక్సిన్, ఆగస్టు 12వ తేదీన రిజిస్టర్ చేయనున్నట్టు ప్రకటించిన రష్యా ఉప ఆరోగ్యశాఖ మంత్రి, మార్గదర్శకాలు పాటించాలని కోరిన డబ్ల్యూహెచ్ఓ
తొలుత వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ చేపడతామని తెలిపారు. రష్యాకు చెందిన గామలేయా ఇనిస్టిట్యూట్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.త్వరలోనే ఆ టీకాను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయనున్నట్లు పుతిన్ తెలిపారు. సెప్టెంబర్ నుంచి ఆ టీకాను హెల్త్ వర్కర్లకు తొలుత ఇవ్వనున్నట్లు రష్యా డిప్యూటీ ప్రధాని తత్యానా గొలికోవా తెలిపారు. జనవరి నుంచి సాధారణ ప్రజలకు ఆ టీకా అందుబాటులో ఉంటుందన్నారు. కరోనాకు 2021లో అంతం తప్పదు, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బిలియనీర్ బిల్ గేట్స్, ధనిక దేశాల్లో 2021 మే నాటికి..మిగతా దేశాల్లో 2022 చివరి నాటికి కనుమరుగవుతుందని వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ఇప్పటివరకూ 2 కోట్లకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూడగా 7.35 లక్షల మంది మహమ్మారి బారినపడి మరణించారు. 1.2 లక్షల మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇక పలు దేశాల్లో కరోనా వైరస్ నిరోధానికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి.