Wuhan Lab Leak: వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ వ్యాప్తి, అత్యున్నత కమిటీ ముందు కుండబద్దలు కొట్టిన కెనడా శాస్త్రవేత్త, కరోనా వ్యాప్తి గుట్టువిప్పే పనిలో నిమగ్నమైన సైంటిస్టులు
దీనికి మరింత బలం చేకూరుస్తూ కెనడాకు చెందిన జీవకణ శాస్త్రవేత్త(molecular biologist) డాక్టర్ అలీనా చాన్(Dr. Alina Chan) సంచనల విషయాలు బయటపెట్టారు.
Canada December 16: ప్రపంచదేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా(Corona Virus) మహమ్మారి గుట్టువిప్పేయత్నాలు ముమ్మరం చేశారు సైంటిస్టులు. చైనాలోని వుహాన్ ల్యాబ్(Wuhan lab) నుంచే కరోనా వ్యాప్తి చెందింది అనేది చాలా మంది వాదన. దీనికి మరింత బలం చేకూరుస్తూ కెనడాకు చెందిన జీవకణ శాస్త్రవేత్త(molecular biologist) డాక్టర్ అలీనా చాన్(Dr. Alina Chan) సంచనల విషయాలు బయటపెట్టారు. కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే వ్యాప్తి(Wuhan lab leak) చెందిన మాట నిజమేంటున్నారు జన్యుశాస్త్రవేత్త.
కెనడా(Canada)కు చెందిన పెద్దల సభకు చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ కమిటీ( Science and Technology Committee) ముందు ఆమె ఈ విషయాన్ని తెలిపారు. కోవిడ్ మహమ్మారి వుహాన్ ప్రాంతంలో ఉన్న ల్యాబ్ నుంచే పుట్టినట్లు అలీనా చాన్ పార్లమెంట్ కమిటీకి వెల్లడించారు. వుహాన్ వైరాలజీ ఇన్స్‌టిట్యూట్(Wuhan Lab)తో లింకు ఉన్న పూరిన్ క్లీవేజ్ సైట్ నుంచి కరోనా వైరస్ ప్రబలినట్లు ఆమె తన రిపోర్ట్‌లో తెలిపారు. ప్రస్తుతం ఉన్న దశలో.. కరోనా వైరస్ సహజంగా పుట్టిందని చెప్పడం కన్నా… ఆ ప్రాణాంతక వైరస్ ల్యాబ్ నుంచే లీకైనట్లు ఆమె పార్లమెంట్ కమిటీకి స్పష్టం చేశారు.
హువాన్ సీఫుడ్ మార్కెట్(Wuhan sea food market) నుంచి మనుషుల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని చాలా వరకు భావిస్తున్నారని, అయితే ఆ మార్కెట్ నుంచి సహజసిద్ధంగా వైరస్ వ్యాప్తి అయినట్లు ఎటువంటి ఆధారాలు లేవని అలీనా చాన్ అన్నారు. ల్యాబ్ నుంచి లీక్ కావడానికి ముందు వైరస్‌లో జన్యు మార్పులు చేశారా అని కమిటీ అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. మేటి వైరాజలిస్టులు ఈ విషయాన్ని అంగీకరిస్తున్నట్లు వెల్లడించారు.