Xylazine: యుఎస్‌ను వణికిస్తున్న జిలాజైన్ డ్రగ్, చర్మం కుళ్లిపోయి జాంబీల మాదిరిగా తయారవుతున్న అమెరికన్లు, అసలేంటి ఈ జైలజీన్ డ్రగ్, ఎందుకు అంతలా బానిస అవుతున్నారు
జైలజీన్ (Xylazine) అనే ఈ డ్రగ్ పశువులకు వైద్యులు మత్తుమందుగా ఉపయోగిస్తుంటారు.
అమెరికాలోని ఓ కొత్త డ్రగ్ విపత్తుకు కారణమవుతోంది.జిలాజైన్ అనే డ్రగ్ కారణంగా ప్రజల శరీర చర్మం కుళ్లిపోయి జాంబీల మాదిరిగా (Turning People Into Zombies) కనిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. జైలజీన్ (Xylazine) అనే ఈ డ్రగ్ పశువులకు వైద్యులు మత్తుమందుగా ఉపయోగిస్తుంటారు. టైమ్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం, జిలాజైన్ వ్యాప్తి.. USలో ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తోంది. ఈ ప్రమాదకరమైన ఔషధం ఉపయోగం భారీ స్థాయిలో పెరుగుతోంది. ఇది చర్మ వ్యాధులకు, అధిక మోతాదులో ప్రమాదకర ఘంటికలను (Causing Alarm In US) తీసుకువస్తోంది.
ట్రాంక్ గా కూడా పిలిచే ఈ మందు..అమెరికాలోని మెజారిటీ నగరాల్లో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.దేశంలోని చాలా నగరాల్లో ఈ మెడిసిన్ కనిపిస్తున్నదని టైమ్ మ్యాగజైన్ పేర్కొన్నది. ఈ జైలజీన్ డ్రగ్ జంతువులకు వినియోగించే మందు అని, అయితే దీన్ని మధ్యస్థం నుంచి తీవ్ర ఒంటి నొప్పులను తగ్గించుకొనేందుకు హెరాయిన్ మాదిరిగా అధికంగా వినియోగిస్తున్నారని తెలిపింది.
మొదటగా ఫిలడెల్ఫియా నగరంలో కనిపించిన ఈ డ్రగ్.. తర్వాత శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్‌ఏంజెల్స్ వంటి నగరాలకు కూడా పాకింది. ఫెంటానిల్, హెరాయిన్, కొకైన్ బదులుగా దీన్ని వినియోగిస్తున్నారని తెలుస్తోంది. జంతువులకు వినియోగించేందుకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) ఆమోదించిన ఈ జైలజీన్ మానవులకు సురక్షితం కాదని, దీన్ని ఓవర్ డో స్ తీసుకొన్న వారికి రివర్స్ చికిత్స కింద ఇచ్చే నాలోక్సోన్‌కు కూడా స్పందించదని నిపుణులు చెబుతున్నారు.
ఈ ట్రాంక్ డోప్ అనేది ఫెంటానిల్ మిశ్రమమని, ఇది అమెరికా యువత జీవితాలను నాశనం చేస్తున్నదని స్కై న్యూస్ పేర్కొన్నది. ఈ వెటర్నరీ డ్రగ్‌ను తక్కువ ధరకే ఏకంగా వీధుల్లోనే అమ్మేస్తుండటం మరింత ఆందోళనకరమైన అంశమని తెలిపింది. ఈ డ్రగ్ దేశమంతటా వ్యాప్తిచెందితే.. అది ప్రజల ఆరోగ్యానికే ముప్పుగా మారే ప్రమాదం ఉన్నదని ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
Xylazine అంటే ఏమిటి
'ట్రాంక్' అని పిలువబడే యానిమల్ ట్రాంక్విలైజర్ జిలాజైన్, ఫెంటానిల్ మిశ్రమం. Xylazine ఫెంటానిల్, హెరాయిన్, కొకైన్ స్థానిక అక్రమ సరఫరాలలోకి ప్రవేశించి ఉండవచ్చు. ట్రాంక్విలైజర్ వినియోగదారులను గంటల తరబడి మత్తులో ఉంచుతుంది. ఇది ఓపియాయిడ్ అధిక మోతాదులను రివర్స్ చేయడానికి ఉపయోగించే నాలోక్సోన్ ప్రభావానికి అంతరాయం కలిగించే శ్వాసను అచేతనావస్థలో ఉంచుంది.