Zombie Deer Disease: ముంచుకొస్తున్న మ‌రో మ‌హ‌మ్మారి, జింక‌ల్లో మొద‌లై మ‌నుషుల‌కు కూడా సోకే ప్ర‌మాదముంద‌ని నిపుణుల హెచ్చ‌రిక‌

‘జాంబీ డీర్‌ డిసీజ్‌’ (Zombie Deer Disease) వేగంగా విస్తరిస్తున్నదని, ఇది త్వరలోనే మానవులకూ అంటుకోవడం ఖాయమంటూ కెనడా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీని అసలు పేరు ‘క్రోనిక్‌ వేస్టింగ్‌ డిసీజ్‌’.

Deer (Photo Credits: Pexels)

New York, FEB 21: ఉపద్రవంలా వచ్చిపడి ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి (Corona) దాదాపు మాయమైన వేళ కొత్త భయాలు పుట్టుకొస్తున్నాయి. ‘జాంబీ డీర్‌ డిసీజ్‌’ (Zombie Deer Disease) వేగంగా విస్తరిస్తున్నదని, ఇది త్వరలోనే మానవులకూ అంటుకోవడం ఖాయమంటూ కెనడా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీని అసలు పేరు ‘క్రోనిక్‌ వేస్టింగ్‌ డిసీజ్‌’. ఈ ఇన్ఫెక్షన్‌ సోకిన జంతువు ఏదైనా మెదడువాపు లాంటి తీవ్రమైన సమస్యలతో చనిపోతుంది. ఇప్పుడీ ఇన్ఫెక్షన్‌ అమెరికాలోని జింకల్లో శరవేగంగా విస్తరిస్తున్నది. జనవరి చివరి వారంలో రెండు కేసులు వెలుగు చూడడంతో దీనికి అడ్డుకట్ట వేసేందుకు బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్స్‌ చర్యలు ప్రారంభించింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జింకలు (Deers), దుప్పి, కణుజు, క్యారిబో వంటివి వాటికి పరీక్షలు చేయాలని అధికారులు ఆదేశించారు.

COVID-19 vaccination: క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి గుండె స‌మ‌స్యలు నిజ‌మే! డ‌బ్లూహెచ్ వో ప‌రిశోధ‌న‌ల్లో తేలిన సంచ‌ల‌న విష‌యాలు 

ప్రొటీన్లు సరైన ఆకారం సంతరించుకోకపోవడమే జాంబీ డీర్‌ డిసీజ్‌కు (Zombie Deer Disease) కారణం. ఇది సోకిన తర్వాత ప్రియాన్స్‌ కేంద్ర నాడీ వ్యవస్థ గుండా ప్రయాణించి మెదడు కణజాలం, అవయవాల్లోకి చొరబడుతుంది. ఈ డిసీజ్‌ సోకిన జింకలు చొంగకార్చుకోవడం, నడుస్తుండగా అదుపు తప్పడం, ఉదాసీనంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ కారణంగా ఈ డిసీజ్‌కు జాంబీ డీర్‌ డిసీజ్‌ అని పేరు వచ్చింది. ప్రస్తుతం ఇది జంతువుల్లోనే వెలుగుచూసినప్పటికీ మానవులకు సోకినట్టు ఎక్కడా నిర్ధారణ కాలేదు. కాకపోతే వేగంగా విస్తరిస్తుండడంతో మానవులకూ సోకే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.