COVID-19 vaccination (ANI Photo)

New York, FEB 21: కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ (COVID-19 vaccination) తర్వాత వివిధ దేశాల్లో (భారత్‌ మినహా) టీకా తీసుకున్న వారిలో గుండె సమస్యలు, మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం (blood clots) వంటి దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. కొవిడ్‌-19 టీకా దుష్ప్రభావాలపై (COVID-19 vaccination) ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ కీలక డాటా సేకరించింది. ద గ్లోబల్‌ కొవిడ్‌ సేఫ్టీ ప్రాజెక్ట్‌.. పేరుతో కొవిడ్‌ టీకాల పనితీరును మదింపు చేసింది. భారత్‌ మినహా వివిధ దేశాల్లో 9.9 కోట్లమంది పేషెంట్ల నుంచి డాటాను సేకరించి ఈ నివేదికను రూపొందించినట్టు తెలిసింది.

Covishield Vaccine: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌తో గుండెపై తీవ్ర దుష్ప్రభావాలు, గుండెపోటు,పక్షవాతం,రక్తంలో గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని తెలిపిన ప్రముఖ కార్డియాలజిస్ట్ అసీమ్‌ మల్హోత్రా 

ఎంఆర్‌ఎన్‌ఏ (MRNA Vaccine) కొవిడ్‌ టీకాలు తీసుకున్నవారిలో గుండె సమస్యలు, మెదడు రక్తనాళాల్లో గడ్డకట్టడం వంటివి 1.5 రెట్లు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ తరహా టీకాలే భారత్‌లోనూ పెద్ద సంఖ్యలో తీసుకున్నారని, దీని ప్రభావం ఏంటన్నది మాత్రం శాస్త్రీయంగా బయటకు రాలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.