Decline in Vehicle Retails: భారీగా పడిపోయిన వాహనాల అమ్మకాలు, టూవీలర్లు కొనేందుకు ఆసక్తిచూపించని జనం, ఏప్రిల్‌లో దారుణంగా వాహన రీటైల్ రంగం పరిస్థితి
ఏప్రిల్‌లో వాహనాల కొనుగోళ్లు 4 శాతం మే తగ్గినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. FADA డేటా ప్రకారం 2023-2024 ఆర్ధిక సంవత్సరంలో వాహనాల అమ్మకాల్లో తగ్గుదల కనిపిస్తోంది. త్రీవీలర్స్ అమ్మకాల్లో మాత్రం కాస్త మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ఏప్రిల్ లో 57 శాతం 3 వీలర్స్ అమ్మకాలు పెరిగాయని తెలిపింది.
Mumbai, May 04: వాహనాల అమ్మకాల్లో ఏప్రిల్ (Decline in Vehicle Retails) నెల నిరాశే మిగిల్చింది. ఏప్రిల్‌లో వాహనాల కొనుగోళ్లు 4 శాతం మే తగ్గినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. FADA డేటా ప్రకారం 2023-2024 ఆర్ధిక సంవత్సరంలో వాహనాల అమ్మకాల్లో తగ్గుదల కనిపిస్తోంది. అయితే త్రీవీలర్స్ అమ్మకాల్లో మాత్రం కాస్త మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ఏప్రిల్ లో 57 శాతం 3 వీలర్స్ అమ్మకాలు పెరిగాయని తెలిపింది. ఇక ట్రాక్టర్లు 1శాతం, కమర్షియల్ వెహికిల్స్ అమ్మకాలు 2శాతం పెరిగాయి. కానీ టూ వీలర్స్ (2-wheelers) కొనుగోలుదారులు భారీగా తగ్గినట్లు FADA తెలిపింది. ఈ సెగ్మెంట్‌లో 7శాతం తగ్గుదల కనిపించింది.
ఇక ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాలు దాదాపు 1 శాతం తగ్గాయి. ఎంట్రీలెవర్ టూవీలర్ సెగ్మెంట్ మాత్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఈ సెగ్మెంట్‌లో 2019 ఏప్రిల్‌తో పోల్చితే దాదాపు 19 శాతం తగ్గుదల నమోదైంది. కరోనా తర్వాత టూవీలర్ల కొనుగోలు గణనీయంగా పెరిగాయి.
కానీ తర్వాత సంవత్సరాల్లో అదేస్థాయిలో కొనుగోళ్లు కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్ధికమాంధ్యం ఎఫెక్ట్ తో పాటూ, పలు కారణాల వల్ల వాహనాల కొనుగోళ్లు తగ్గినట్లు నిపుణులు అంచనావేస్తున్నాయి. రానున్న రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది.