Pleasure Plus Xtec Sports: హీరో నుంచి మరొక ఆకర్షణీయమైన స్కూటర్.. ప్లెజర్ ప్లస్‌లో సరికొత్త Xtec స్పోర్ట్స్ వేరియంట్‌ను విడుదల చేసిన హీరో మోటోకార్ప్, దీని ధర ఎంతంటే?

Pleasure Plus Xtec Sports | Pic: HerpMotocorp Official

Hero Pleasure Plus Xtec Sports: టూవీలర్ తయారీదారు హీరో మోటోకార్ప్ తమ బ్రాండ్ నుంచి పాపులర్ మోడల్ అయిన 'హీరో ప్లెజర్ ప్లస్' లో సరికొత్త స్పోర్ట్స్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ప్లెజర్ ప్లస్ Xtec స్పోర్ట్స్ పేరుతో విడుదలైన ఈ కొత్త వేరియంట్ స్కూటీ డ్యూయల్-టోన్ అబ్రాక్స్ ఆరెంజ్ బ్లూ కలర్ థీమ్‌తో వచ్చింది. స్కూటీకి ముదురు నీలం రంగు ప్రాథమిక రంగు అయితే, ఆరెంజ్ షేడ్ అద్భుతమైన కాంట్రాస్ట్‌ను అందిస్తుంది. ఆరెంజ్ ఎలిమెంట్స్ ఫ్రంట్ ఫెండర్, ఆప్రాన్ అలాగే సైడ్ బాడీ ప్యానెల్స్‌పై చూడవచ్చు. హెడ్‌ల్యాంప్, ఫ్రంట్ ఆప్రాన్, హ్యాండిల్‌బార్, సైడ్ ప్యానెల్‌ల అంతటా క్రోమ్ యాక్సెంట్‌లతో మొత్తం ఈ స్కూటీ లుక్, ఫీల్ మరింత మెరుగుపరచబడ్డాయి. ప్లెజర్ ప్లస్ Xtec స్పోర్ట్స్ వేరియంట్‌లో అత్యంత ప్రత్యేకమైన అంశం ఆప్రాన్ మరియు సైడ్ ప్యానెల్‌లపై #18 గ్రాఫిక్‌ను కలిగి ఉండటం. ఇది 18 సంవత్సరాల నిండిన యువత డ్రైవింగ్ లైసెన్స్ పొందే చట్టబద్ధతను తెలియజేస్తుంది.

ప్లెజర్ ప్లస్‌ Xtec స్పోర్ట్స్- ఇంజన్ వివరాలు

Xtec స్పోర్ట్స్ వేరియంట్‌లో పాత మోడల్స్ Xtec మరియు 'Xtec కనెక్ట్డ్ లో ఉన్నట్లుగానే 110.9cc సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 8 BHP శక్తిని, 8.7 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది, దీని ఇంజన్ CVT ట్రాన్స్ మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.

ఇతర స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే, ముందువైపు బాటమ్ లింక్ సస్పెన్షన్, వెనుకవైపు సింగిల్ షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. రెండు వైపులా డ్రమ్‌లను బ్రేక్ లను కలిగి ఉంటుంది, దీనికి కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ సపోర్ట్ ఉంటుంది.

ఫీచర్లలో భాగంగా ఈ స్కూటర్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మరియు LED హెడ్‌ల్యాంప్ ఉన్నాయి.

ప్లెజర్ ప్లస్‌ 'Xtec స్పోర్ట్స్' ధర ఎక్స్- షోరూమ్ వద్ద రూ. 79,738/- గా ఉంది.



సంబంధిత వార్తలు

Realme 14X 5G: రియల్ మి నుంచి తొలిసారిగా ఐపీ69 డస్ట్‌ అండ్‌ వాటర్‌ రెసిస్టెన్స్‌ స్మార్ట్‌ఫోన్, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరాతో రియల్‌మీ 14ఎక్స్‌ 5జీ వచ్చేసింది, ధర, పీచర్లు ఇవిగో..

Poco M7 Pro 5G: పోకో నుంచి అదిరే ఫీచర్లతో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్లు, పోకో ఎం7 ప్రో 5జీ,పోకో సీ7 5జీ ధర, ఫీచర్ల వివరాలు తెలుసుకోండి

Ravichandran Ashwin Records: 11 సార్లు ప్లేయ‌ర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు, రవిచంద్రన్ అశ్విన్ రికార్డులు ఇవిగో, హర్భజన్ సింగ్ ప్లేసు భర్తీ చేసి అద్భుతాలు సృష్టించిన లెజెండరీ ఆఫ్ స్పిన్నర్

Year Ender 2024: లెజెండ్ సింగర్ పంకజ్ ఉదాస్ నుంచి ఉస్తాద్ రషీద్ ఖాన్ దాకా, ఈ ఏడాది మనల్ని వీడిన ప్రముఖ సినిమా సెలబ్రిటీలు వీరే

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif