Honda New SP 160: మార్కెట్లోకి కొత్త బైక్ రిలీజ్ చేసిన హోండా, ఎక్స్ షో రూం ధ‌ర కేవ‌లం రూ. 1.21 ల‌క్ష‌ల నుంచే ప్రారంభం

దేశీయ మార్కెట్లోకి నయా బైకు ‘ఎస్‌పీ160’ని (Honda New SP 160) పరిచయం చేసింది. హై-టెక్‌ ఫీచర్‌తోపాటు అధిక పనితీరుతో రూపొందించిన ఈ బైకు కస్టమర్లకు నూతన రైడింగ్‌ అనుభవం కల్పించే విధంగా తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

Honda New SP 160

Mumbai, DEC 25: ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటర్‌సైకిల్‌ (Honda) అండ్‌ స్కూటర్‌ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి నయా బైకు ‘ఎస్‌పీ160’ని (Honda New SP 160) పరిచయం చేసింది. హై-టెక్‌ ఫీచర్‌తోపాటు అధిక పనితీరుతో రూపొందించిన ఈ బైకు కస్టమర్లకు నూతన రైడింగ్‌ అనుభవం కల్పించే విధంగా తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. రెండు రకాల్లో లభించనున్న ఈ హోండా ఎస్‌పీ 160 మాడల్‌ సింగిల్‌ డిస్క్‌ ధర రూ. 1,21,951 కాగా, డబుల్‌ డిస్క్‌ ధర రూ. 1,27,956గా నిర్ణయించింది.

Bajaj Chetak: చేతక్‌ సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. సింగిల్‌ చార్జింగ్‌ తో 153 కి.మీ... గరిష్ఠ ధర రూ.1.27 లక్షలు 

ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ త్సుత్సుము ఒటాని మాట్లాడుతూ..కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా ఈ నూతన ఎస్‌పీ160ని రూపొందించినట్లు, బ్లూటూత్‌ కనెక్ట్‌తో టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉండటంతో నావిగేషన్‌ ఆధారంగా తాము వెళ్లాలనుకున్న చోటికి సులభంగా చేరుకోవచ్చునన్నారు.