Suzuki Access 125 BS6: సుజుకి యాక్సెస్ 125 బిఎస్ 6 వెర్షన్ భారత మార్కెట్లో విడుదల, దిల్లీ ఎక్స్ షోరూంలో రూ. 64 వేల నుంచి ధరల ప్రారంభం, హోండా యాక్టివా మరియు యమహా ఫాసినో స్కూటర్లతో పోటీ
అలాగే బ్యాటరీని సూచించే డిజిటల్ స్కీన్ కూడా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది....
ప్రముఖ ద్విచక్రవాహన తయారీదారు సుజుకి తాజాగా బిఎస్ 6 వెర్షన్‌లో సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ (Suzuki Access 125 BS6)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దిల్లీ ఎక్స్ షో రూం (Delhi Ex-show room) లో బేసిక్ డ్రమ్ వేరియంట్ స్కూటర్ ధర (Price) రూ. 64,800 రూపాయలుగా ఉంది మరియు డిస్క్ సిబిఎస్ మరియు స్పెషల్ ఎడిషన్ వేరియంట్లు రూ .69,500 వరకు వేరియంట్‌ను బట్టి వివిధ ధరల్లో అందుబాటులో ఉన్నాయి.
మెరుగైన బిఎస్ 6 ప్రమాణాలు గల ఈ స్కూటర్ లో ఇంధన వ్యవస్థలో మార్పులు చేస్తూ 'ఫ్యుఎల్ ఇంజెక్షన్‌కు మార్చబడినట్లు కంపెనీ పేర్కొంది.
ఔట్ పుట్ పరంగా, అప్‌గ్రేడ్ చేయబడిన ఈ సుజుకి యాక్సెస్ 125 సిసి స్కూటర్ 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 హెచ్‌పి మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బిఎస్ 4 ఇంజన్లతో వచ్చిన వెర్షన్ స్కూటర్ల లాగే ఈ స్కూటర్ పవర్ లో కూడా మార్పులేమి లేవు.
అయితే, కొత్తగా బేసిక్ డ్రమ్ వేరియంట్లలో కూడా బయటివైపుకు ఫ్యూయెల్ లిడ్, LED హెడ్‌లైట్ మరియు స్పీడోమీటర్‌పై ఎకో లైట్ లాంటి ఆకర్శణలను జోడించింది. అలాగే బ్యాటరీని సూచించే డిజిటల్ స్కీన్ కూడా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ కొత్త బిఎస్ 6-కంప్లైంట్ సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ మార్కెట్లో ఇప్పటికే విడుదలైన యమహా ఫాసినో 125 మరియు హోండా యాక్టివా 125 లతో పోటీపడుతుంది. అప్‌డేట్ చేసిన యమహా ఫాసినో 125 డ్రమ్ వేరియంట్ ధర రూ. 66,430, డిస్క్ వేరియంట్‌కు రూ. 68,930 గా ఉండగా, హోండా యాక్టివా 125 డ్రమ్ వేరియంట్ ధర రూ. 67,490 మరియు డిస్క్ వేరియంట్ ధర రూ. 74,490 గా ఉన్నాయి. అయితే సుజుకి యాక్సెస్ స్పెషల్ ఎడిషన్ ధరలు మాత్రం మిగతా కంపెనీల స్కూటర్ల ధరల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.