Rolls-Royce Cullinan: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన SUV కార్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో. ధర ఎంతో, ఫీచర్లు ఏంటో తెలిస్తే మతిపోతుంది.

ఈ కారుకు ఎన్నో విశేషాలు, మరెన్నో అద్భుతమైన ఫీచర్లు.

The most expensive SUV car in the world

ఖరీదైన SUV కార్లుగా పిలువబడే ల్యాండ్ క్రూజర్ (ధర: రూ. 1.35 cr, బీఎండబ్ల్యూ X5 రూ. 89 లక్షలు, ఫార్చూనర్ రూ. 32 లక్షలు, హ్యుందాయ్ సాంటా ఫే  రూ.31 లక్షలు, హోండా సీఆర్-వీ రూ.25 లక్షలు లాంటివి ఇప్పటికే భారత రోడ్లపై ఠీవీగా పరుగులు పెడుతున్నాయి. అయితే వీటన్నింటిని మించిన రారాజు రోల్స్ రాయిస్ కలినాన్ (Rolls-Royce Cullinan) భారత మార్కెట్లోకి అడుగు పెట్టింది. భారత మార్కెట్లో దీని ధర 8.02 కోట్లుగా ఉంది (On Road). ఒక విధంగా చెప్పాలంటే ఈ కార్ ప్రపంచంలోని అన్ని ఎస్‌యూవీ కార్ల కంటే అత్యంత ఖరీదైనది.

రోల్స్ రాయిస్ బ్రాండ్ నుంచి వచ్చే కార్లకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆ కార్లను కదిలే రాజమేడలుగా చెప్తారు. అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు ఉండటం వలన వాటికి ఆ పేరు. రోడ్లపై రోల్స్ రాయిస్ కార్ వెళ్తుంటే ఆ రాజసమే వేరు.

మనదేశంలో ఇప్పటివరకు రోల్స్ రాయిస్ కలినాన్ కలిగి ఉన్న తొలివ్యక్తి అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ (Mukesh Ambani). ఆ తర్వాత ఇటీవల టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ (Bhushan Kumar , T- Series) కూడా ఈ కారును సొంతం చేసుకున్న వారి జాబితాలోకి ఎక్కారు.

ఒకసారి ఈ రోల్స్ రాయి ఫీచర్లు ఏంటో, దీని ప్రత్యేకతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఇంజిన్ సామర్థ్యం - 6751 CC

పవర్ - 563 bhp@5000 rpm

టార్క్ - 850 Nm@1600 rpm

మైలేజ్ - లీటరుకు 7 కి.మీ

ఫ్యుయెల్ ట్యాంక్ - పెట్రోల్

గేర్లు - 8

సిలిండర్ల సంఖ్య - 12

గరిష్ట వేగం - గంటకు 250 కి. మీ

5.2 సెకన్లలోనే 0 నుంచి 100 కి. మీ వేగాన్ని అందుకోగలదు.

Rolls-Royce Cullinan ప్రత్యేకతలు:

రోల్స్ రాయిస్ కలినాన్ కారు ఇంటిరీయర్ పూర్తిగా అధునాతనమైన టెక్నాలజీతో అమర్చబడి ఉంది. ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో కారు డాష్ బోర్డులో ఉండే ఎల్‌ఈడీ స్క్రీన్ టచ్ చేస్తే పూర్తి వివరాలు అందిస్తుంది. వెనక సీట్లో కూర్చుండే వారికోసం కూడా 12 ఇంచుల హైడెఫినేషన్ స్క్రీన్స్ ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అందులో బ్లూరే ప్లేయర్, టీవీ ఆప్షన్స్ గా ఇచ్చారు. కారులో మొత్తం 18 రోల్స్ రాయిస్ నెక్స్ట్ జెనరేషన్ స్పీకర్లు అమర్చారు. కారులో కూర్చున్న వారికి చీకటి వేళల్లో కూడా నలువైపులా ఏముందో చూసేలా ప్రత్యేకమైన 4 కెమరాలు అమర్చారు, ఏవైనా కదలికలు ఉంటే వెంటనే అప్రమత్తం చేసే సిస్టం కూడా ఉంది.

సీట్లన్నీ విలాసవంతమైన ఫాబ్రిక్, ఖరీదైన లెదర్ తో ఇచ్చారు, సీట్లో కూర్చున్న వారి కోసం మసాజ్ సౌలభ్యం కూడా ప్రోగ్రామ్ చేసి ఉంచారు.

డ్రైవింగ్ మోడ్ లో ఉండే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఎలాంటి రోడ్డుపై వెళ్తున్నా సరే ఎటువంటి కుదుపులు లేకుండా, సౌకర్యవంతంగా ఉంటుంది. స్టీరింగ్ ను పైకి కిందకు అడ్జస్ట్ చేసుకోవచ్చు, నీటి ప్రవాహం ఉంటే కారు హైట్ ను కూడా అడ్జస్ట్ చేసుకునే వీలుంది. ఇలా ఒకటేమిటి ఇంకా ఎన్నెన్నో ప్రత్యేకతలు ఈ కారు సొంతం.