Toyota Kirloskar to Invest in India: రూ.3,300 కోట్ల పెట్టుబడితో భారత్‌లో మూడవ ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్న టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌, కొత్త ప్లాంట్‌ ద్వారా 2,000 మందికి ఉద్యోగాలు

కర్ణాటకలోని బిదాడిలో ఈ కేంద్రం రానుంది.2026 నాటికి నూతన ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం కానుంది

Toyota (Photo Credits: IANS | Twitter)

వాహన తయారీ దిగ్గజ సంస్థ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ భారత్‌లో మూడవ ప్లాంట్‌ ఏర్పాటుకు రూ.3,300 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మంగళవారం ప్రకటించింది. కర్ణాటకలోని బిదాడిలో ఈ కేంద్రం రానుంది.2026 నాటికి నూతన ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం కానుంది. రెండు షిఫ్టులలో 1 లక్ష యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. బిదాడిలో ఇప్పటికే సంస్థకు రెండు యూనిట్లు ఉన్నాయి. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3.42 లక్షల యూనిట్లు.

ఎలక్ట్రిక్ కార్ల రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన షియోమీ, గంటకు  ఎంత వేగంతో వెళ్తుందంటే!

మల్టీ–యుటిలిటీ వెహికిల్‌ ఇన్నోవా హైక్రాస్‌తోపాటు వివిధ ఇంధన సాంకేతికతలతో మోడళ్లను తయారు చేసేందుకు భవిష్యత్‌కు అవసరమయ్యే స్థాయిలో కొత్త ప్లాంట్‌ ఉంటుందని టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్‌ విక్రమ్‌ గులాటీ తెలిపారు. కొత్త ప్లాంట్‌ ద్వారా 2,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న రెండు ప్లాంట్లలో 11,200 మంది పని చేస్తున్నారని వివరించారు.