Triumph Scrambler 1200 X: వేగంతో పోటీ.. దీనికి లేదు మరేసాటి.. ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ నుంచి సరికొత్త 'స్క్రాంబ్లర్ 1200 X' బైక్ భారత మార్కెట్లో విడుదల, ధరెంతో తెలుసా?

Triumph Scrambler 1200 X | Pic: Triumph Official

Triumph Scrambler 1200 X: యూకేకి చెందిన లగ్జరీ మోటార్ సైకిల్స్ కంపెనీ ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ తాజాగా తమ బ్రాండ్ నుంచి 'ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 1200 X' అనే మోటార్ సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 11.83 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది వివిధ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. వినియోగదారులు ఎంచుకునే కలర్ స్కీమ్‌ను బట్టి ఈ బైక్ ధరల్లో మార్పు ఉంటుంది. సాఫైర్ బ్లాక్ కలర్ స్కీమ్ ధర రూ. 11.83 లక్షలు కాగా, కార్నివాల్ రెడ్ మరియు యాష్ గ్రే కలర్ స్క్రీమ్ మోడల్ ధరలు రూ. 12.13 లక్షలుగా నిర్ణయించారు.

ఈ కొత్త స్క్రాంబ్లర్ 1200 X మోటార్‌సైకిల్ అనేది ఇంతకుముందు నిలిపివేయబడిన స్క్రాంబ్లర్ 1200 XC యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతుంది. అదనంగా, స్క్రాంబ్లర్ 1200 XC కంటే ఇది కాస్త ధర తక్కువ, కానీ సామర్థ్యంలో మాత్రం అదే స్థాయిని కలిగి ఉంది. ట్రయంఫ్ ఇటీవల భారతీయ మార్కెట్ కోసం విడుదల చేసిన స్క్రాంబ్లర్ 400 X మంచి స్పందన వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు 1200 X మోడల్ విడుదల చేశారు.  భారతీయ మార్కెట్లో ట్రయంఫ్ బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలో లభించే అతిపెద్ద స్క్రాంబ్లర్‌ ఇదే కావడం విశేషం.

ట్రయంఫ్ స్క్రాంబ్లర్ ఇంజన్ సామర్థ్యం, ఇతర వివరాలు

ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 1200 Xలో 1,200 cc సామర్థ్యం కలిగిన ఇంజన్ అమర్చారు, ఇది 270-డిగ్రీ క్రాంక్‌తో సమాంతర-ట్విన్ ఇంజన్. దీనిని 6-స్పీడ్ గేర్‌బాక్స్ యూనిట్ మరియు స్పీడ్ వెట్, మల్టీ-ప్లాట్ అసిస్ట్ క్లచ్‌తో జత చేశారు.

ఈ ఇంజన్ 7,000 rpm వద్ద 89 bhp గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది, మరియు 4,250 rpm వద్ద 110 Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను విడుదల చేస్తుంది. అదనంగా ఈ ఇంజన్ రైడ్-బై-వైర్ అలాగే ఫ్యూయల్ ఇంజెక్షన్ పొందుతుంది.

మోటార్‌సైకిల్ ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంటుంది. ముందు భాగంలో మార్జోచి ఫోర్క్‌లు, వెనుక భాగంలో మార్జోచి ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనో-షాక్‌ అబ్జర్బర్లను పొందుతుంది. బ్రేకింగ్ విధులను రెండు-పిస్టన్ నిస్సిన్ యాక్సియల్ కాలిపర్ చూసుకుంటుంది, ముందు భాగంలో ట్విన్ 310 మిమీ డిస్క్‌లు, వెనుకవైపు ఒకే 255 డిస్క్‌లు ఉంటాయి. అలాగే ఈ మోటార్‌సైకిల్ రెయిన్, రోడ్, స్పోర్ట్, ఆఫ్-రోడ్ మరియు రైడర్ కాన్ఫిగర్ చేయగల ఐదు రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 1200 X మోటార్‌సైకిల్ TFT డిస్‌ప్లేతో కూడిన మల్టీ-ఫంక్షనల్ LCD ఇన్‌స్ట్రుమెంట్‌ని కలిగి ఉంది. ఈ వృత్తాకార ఆకారపు యూనిట్ ట్రయంఫ్ బ్రాండ్‌లోని ఇతర 660 cc మోటార్‌సైకిళ్లలో కనిపించే మాదిరిగానే ఉంటుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీతో టర్న్-బై-టర్న్ నావిగేషన్, నోటిఫికేషన్ అలర్ట్‌ల వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif