New TVS Jupiter 110: టీవీఎస్‌ నుంచి జూపిటర్‌లో సరికొత్త వెర్షన్‌, 110సీసీ సామర్థ్యంతో కొత్త జూపిటర్‌ స్కూటీని విడుదల చేసిన దిగ్గజం

110సీసీ సామర్థ్యంతో వచ్చిన ఈ స్కూటర్‌ ప్రారంభ ధర ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం రూ.73,700లుగా ఉన్నది.

TVS Motor launches new Jupiter 110 cc at starting price of Rs 73,700

టీవీఎస్‌ మోటర్‌ తమ పాపులర్‌ మోడల్‌ జూపిటర్‌లో సరికొత్త వెర్షన్‌ను పరిచయం చేసింది. 110సీసీ సామర్థ్యంతో వచ్చిన ఈ స్కూటర్‌ ప్రారంభ ధర ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం రూ.73,700లుగా ఉన్నది. మున్ముందు మార్కెట్‌లో స్కూటర్లకు మరింత డిమాండ్‌ ఉంటుందని, దేశీయ ద్విచక్ర వాహన అమ్మకాల్లో స్కూటర్ల వాటా త్వరలోనే ఇంచుమించుగా 40 శాతానికి చేరగలదని సంస్థ సీఈవో కేఎన్‌ రాధాకృష్ణన్‌ ఈ సందర్భంగా తెలిపారు.

ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 250 కిలోమీటర్లు,ప్రాణ ఎలైట్‌ బైక్‌ను విడుదల చేసిన శ్రీవారు మోటర్స్‌, ధర ఎంతంటే..

నగరాలేగాక గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్కూటర్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉందని వివరించారు. ఇక పరిశ్రమ వార్షిక చక్ర వృద్ధిరేటు 8 శాతంగా ఉంటే.. తమ సంస్థది 12 శాతంగా ఉందని చెప్పారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif