తమిళనాడు శ్రీవారు మోటర్స్ గురువారం తమ ప్రీమియం ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్ ప్రాణ 2.0 మోడల్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. చెన్నై ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర రూ.2,55,150గా ఉంది.ఈ బైక్ సింగిల్ చార్జింగ్‌పై 150 కిలోమీటర్లదాకా ప్రయాణం చేయవచ్చని కంపెనీ తెలిపింది. దీంతో పాటుగా ప్రాణ ఎలైట్ బైక్‌నూ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఆడి నుంచి భారత మార్కెట్లోకి క్యూ8 ఫేస్‌లిఫ్ట్ కారు, ధర రూ.1.17 కోట్లు పై మాటే, కేవలం 5.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగం దీని సొంతం
చెన్నై ఎక్స్‌షోరూం ప్రకారంప్రాణ ఎలైట్ బైక్ ధర రూ.3,20,250గా ఉన్నది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. 2021లో ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్ ప్రాణను మార్కెట్‌లోకి తీసుకురాగా తాజాగా ఇప్పుడు దాని అప్‌డేట్ వెర్షన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. కోయంబత్తూర్ సమీపంలోని సూలూర్ ప్లాంట్ లో నెలకు దాదాపు 2వేల బైకులు తయారవుతాయని ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక సీఈవో మోహన్‌రాజ్ రామస్వామి తెలిపారు. 10వేల యూనిట్ల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. త్వరలో ‘ఎలైవ్’ పేరిట ఎలక్ట్రిక్ స్కూటర్లనూ మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది.