Hindenburg-Adani-SEBI: హిండెన్ బర్గ్ మరో బాంబు.. సెబీ చైర్ పర్సన్, ఆమె భర్త కు అదానీ గ్రూప్ సంస్థల్లో వాటాలు.. సంచలన ఆరోపణలు చేసిన అమెరికా షార్ట్ సెల్లర్.. ఆరోపణలపై మండిపడ్డ సెబీ చీఫ్

శనివారం ఉదయం తన ఎక్స్ ఖాతాలో సమ్ థింగ్ బిగ్ న్యూస్ ఇండియా అంటూ హింట్ ఇచ్చిన హిండెన్ బర్గ్.. అనుకున్నట్లుగానే సాయంత్రానికి సంచలన విషయాన్ని బయటపెట్టింది.

SEBI Chairperson Madhabi Buch (Credits: X)

Newdelhi, Aug 11: అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్ బర్గ్ (Hindenburg) కంపెనీ భారత్ పై మరో పెద్ద బాంబ్ పేల్చింది. శనివారం ఉదయం తన ఎక్స్ ఖాతాలో సమ్ థింగ్ బిగ్ న్యూస్ ఇండియా అంటూ హింట్ ఇచ్చిన హిండెన్ బర్గ్.. అనుకున్నట్లుగానే సాయంత్రానికి సంచలన విషయాన్ని బయటపెట్టింది. అదానీ గ్రూప్ కంపెనీల్లో అక్రమాలు జరిగాయని నిరుడు ఆరోపించిన హిండెన్ బర్గ్.. తాజాగా సెబీ (SEBI) చైర్ పర్సన్ మాధబి పురి బచ్ పై సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషన్ ఫండ్ లలో మాధబి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్ బర్గ్ తాజాగా ఆరోపించింది. ఈ మేరకు విజిల్ బ్లోయర్ నుండి తమకు సమాచారం అందిందని హిండెన్ బర్గ్ పేర్కొంది. ఈ క్రమంలోనే అదానీకి చెందిన మారిషన్, అఫ్ షోర్ షెల్ సంస్థల వివరాలను తెలుసుకోవడంలో సెబీ ఆసక్తి చూపలేదని వెల్లడించింది. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయంశంగా మారింది. కాగా, హిండెన్ బర్గ్ ఆరోపణలపై  సెబీ చీఫ్ స్పందించారు. ఇది తమ వ్యక్తిత్వ హననానికి జరుగుతున్న ప్రయత్నమని ఆగ్రహం వ్యక్తం చేశారు.  హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమని, వాటిల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

యూట్యూబ్ మాజీ సీఈవో క‌న్నుమూత‌, రెండేళ్ల పాటూ క్యాన్స‌ర్ తో పోరాడి మ‌ర‌ణించిన సుసాన్ వొజ్కికి, ఆమె లేని ప్ర‌పంచాన్ని ఊహించ‌డం క‌ష్ట‌మంటూ పిచాయ్ ట్వీట్

నిరుడు ఆరోపణలు ఏమిటంటే?

కంపెనీల షేర్ల విలువను కృత్రిమంగా పెంచేందుకు అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిందని, కంపెనీల ఖాతాల్లోనూ మోసాలు చేసిందంటూ గత ఏడాది జనవరిలో హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలతో అదానీ గ్రూప్ కంపెనీలు రూ. 12 లక్షల కోట్ల మేర నష్టాలు చవిచూశాయి.

వాక్ స్వాతంత్య్రం పేరుతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తానంటే కుదరదు, దానికి పరిమితి ఉంటుందని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు