Google Pay Good News: గూగుల్ పే వాడేవారికి శుభవార్త, యూజర్లు గూగుల్ పే ద్వారా వేయి రూపాయలు గెలుచుకోవచ్చు, ప్రాసెస్ ఎలాగో తెలుసుకోండి
టీవీ లేదా యూట్యూబ్‌లో ప్లే అయ్యే గూగుల్ పే యాడ్(Google Pay ads)ను మీ ఫోన్లలోని గూగుల్ పే యాప్‌లో ఉండే ప్రమోషన్స్ సెక్షన్‌లోని ఆన్-ఎయిర్ ఆప్షన్ ద్వారా వింటే యూజర్లకు ఓ స్క్రాచ్ కార్డు వస్తుంది.
Mumbai, December 1: సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) తన గూగుల్ పే(Google Pay) కస్టమర్లకు వేయి రూపాయలు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. టీవీ లేదా యూట్యూబ్‌లో ప్లే అయ్యే గూగుల్ పే యాడ్(Google Pay ads)ను మీ ఫోన్లలోని గూగుల్ పే యాప్‌లో ఉండే ప్రమోషన్స్ సెక్షన్‌లోని ఆన్-ఎయిర్ ఆప్షన్ ద్వారా వింటే యూజర్లకు ఓ స్క్రాచ్ కార్డు వస్తుంది. అయితే ఇందులో సదరు యాడ్‌ను కనీసం 20 సెకన్ల పాటు యాప్ ద్వారా వినాల్సి ఉంటుంది.
దీంతో గూగుల్ పే ఆ యాడ్‌ను గుర్తించి యూజర్‌కు స్క్రాచ్ కార్డును ఇస్తుంది. దాంతో యూజర్లు రూ.1వేయి వరకు గెలుచుకోవచ్చు. ఇక ఈ ఆఫర్ ఇప్పటికే గూగుల్ పే వినియోగదారులకు అందుబాటులో ఉండగా డిసెంబర్ 2 వరకు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చని గూగుల్ పే తెలిపింది.
అయితే యూజర్లకు ఆఫర్ కనిపించకపోతే గూగుల్ పేకు గాను లొకేషన్ హిస్టరీని ఆన్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ప్రమోషన్స్ సెక్షన్‌లో ఆడియో రివార్డ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ఆన్ ఎయిర్ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ఆ గూగుల్ పే ఆఫర్‌ను పొందవచ్చు.