Narayana Murthy: భారతదేశ యువత వారానికి 70 గంటలు పనిచేయాలి.. ఇతర దేశాలతో పోటీ పడేందుకు భారతదేశ పని సంస్కృతిలో తక్షణ మార్పులు రావాలన్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి.. భారత దేశ ఉత్పాదకత తక్కువగా ఉందని విచారం

ఇతర దేశాలతో సమానంగా అభివృద్ధి సాధించాలంటే భారతదేశ పని సంస్కృతిలో తక్షణ మార్పులు రావాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు.

Narayana Murthy (Credits: X)

Hyderabad, Oct 27: ఇతర దేశాలతో సమానంగా అభివృద్ధి సాధించాలంటే భారతదేశ పని సంస్కృతిలో (Work Culture) తక్షణ మార్పులు రావాలని ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) అభిప్రాయపడ్డారు. యువత కష్టపడేందుకు సిద్ధంగా ఉండాలని, వారానికి 70 గంటల పాటు పనిచేయాలని ఆయన సూచించారు. 3వన్4 క్యాపిటల్ తొలి పాడ్‌కాస్ట్ ‘ది రికార్డ్’ అనే ఎపిసోడ్‌ లో నారాయణ మూర్తి పాల్గొన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువగా ఉందని నారాయణ మూర్తి తెలిపారు.

Qatar Sentences 8 Indians to Death: ఎనిమిది మంది భారత మాజీ నౌకాదళ అధికారులకు మరణ శిక్ష విధించిన ఖతార్ కోర్టు, విదేశాంగ స్పందన ఏంటంటే..

యువత ప్రతిజ్ఞ చేయాలని..

రెండో ప్రపంచయుద్ధం తరువాత జపాన్, జర్మనీ దేశాలు తమ పని సంస్కృతిలో మార్పులు చేసుకున్నాయని, యువత అధికసమయం పనికి కేటాయించేలా ప్రోత్సహించాయని తెలిపారు. చైనా వంటి దేశాలతో పోటీపడేందుకు ఇది అవసరమని చెప్పారు. ‘‘ఇది నా దేశం. నా దేశం కోసం వారానికి 70 గంటలు కష్టపడతాను’’ అని యువత ప్రతిజ్ఞ చేయాలని ఆయన సూచించారు.

కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి మనమంతా సిద్ధంగా ఉండాలి, వైమానిక కమాండర్లకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపు