Samsung Galaxy Z Flip 4: సామ్‌సంగ్ మడత స్మార్ట్‌ఫోన్‌ల ధరలు ఢమాల్, ఆ మోడల్‌పై తిరుగులేని డిస్కౌంట్, భారీగా పతనమైన ధరతో చవక ధరకే లభిస్తున్న బ్రాండెడ్ ఫోన్.. త్వరపడండి!

Samsung Galaxy Z Flip 4 Foldable smartphone | Pic: X

Samsung Galaxy Z Flip 4: ఒకప్పుడు మొబైల్ ఫోన్‌లలో మడత ఫోన్‌ల స్థానం ఎంతో ప్రత్యేకమైనది. ఈ మోడల్ ఫోన్‌లను చాలా మంది స్టైల్, స్టేటస్ సింబల్ కోసం ఉపయోగించేవారు. స్మార్ట్‌ఫోన్‌ల ఎంట్రీతో అన్ని రకాల మోడల్ ఫోన్‌లు కనుమరుగైపోయాయి. అయినప్పటికీ కొన్ని టెక్ కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌లలోను మడత ఫోన్‌లను తీసుకొచ్చాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ సామ్‌సంగ్  తమ బ్రాండ్ మీద మడత స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేసింది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు ఎంతగానో ఆకర్షించినప్పటికీ, వీటి ధరలు భయపెట్టేవి, దీంతో ఇలాంటి ఫోన్ కలిగి ఉండాలని ఆసక్తి కనబర్చినవారు వాటి ధరలను చూసి కొనుగోలు చేయకుండా వెనకడుగు వేసేవారు. అయితే, అలాంటి వారికి ఒక ఔత్సహకరమైన వార్త.

మీరు Samsung నుండి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే.. అందుకు ఇదే సరైన సమయం కావచ్చు.  ఎందుకంటే సామ్‌సంగ్  కంపెనీ తమ Galaxy Z Flip 4 స్మార్ట్‌ఫోన్ ధరను ఇప్పుడు భారీగా తగ్గించింది. ఎంతగా అంటే, ఏదో నామమాత్రంగా ఒక వెయ్యి, రెండు వేలు కాదు.. ఏకంగా రూ. 25 వేల భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. దీంతో సామ్‌సంగ్ మడత స్మార్ట్‌ఫోన్‌ల ధరలు ఢమాల్ అన్నాయి. ఒక్కసారిగా ధరలు కిందకు దిగివచ్చాయి.

Samsung Galaxy Z Flip 4 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో లభిస్తుంది, ఈ రెండింటిపై ధర రూ. 25,000 తగ్గింది.

ఈ ఫోన్ లాంచ్ చేసినప్పుడు 8GB+128GB వేరియంట్ ధర, రూ.89,999/- అలాగే 8GB+256GB వేరియంట్ ధర రూ.94,999/-గా ఉండేది.

ప్రస్తుతం రూ. 25,000 డిస్కౌంట్ ప్రకటించారు కాబట్టి, తగ్గింపు తర్వాత 128GB వెర్షన్‌ రూ. 64,999 మరియు 256GB వేరియంట్‌ రూ. 69,999/- ధరలకే కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక సారి ఈ కింద చెక్ చేయండి.

Samsung Galaxy Z Flip 4 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు,స్పెసిఫికేషన్లు

  • మడత పెడితే కాంపాక్ట్ 1.9-అంగుళాల సూపర్ AMOLED కవర్ డిస్‌ప్లే
  • మడత తెరిస్తే 6.7-అంగుళాల FHD+ డైనమిక్ AMOLED 2X ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లే
  • 1Hz నుంచి120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 2640 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌
  • 8GB RAM, 128GB/256GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్
  • వెనకవైపు 12MP+12MP డ్యుఎల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 10MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 3700mAh బ్యాటరీ సామర్థ్యం, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ

ఈ స్మార్ట్‌ఫోన్‌ బోరా పర్పుల్, గ్రాఫైట్ మరియు పింక్ గోల్డ్ వంటి మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉన్నాయి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now