Samsung Unveils Galaxy A56 A36 A26

New Delhi, March 02: శాంసంగ్ నుంచి మిడ్‌ రేంజ్‌లో ఏఐ పవరెడ్‌ గెలాక్సీ A56, A36 A26 ఫోన్లు వచ్చేశాయి. ధరలు అంతగా భారీగా లేకుండా, ఫీచర్లు అధికంగా ఉండే ఈ స్మార్ట్‌ఫోన్‌లను శాంసంగ్ ఆదివారం విడుదల చేసింది. ఏఐ సపోర్ట్‌తో, చాలా కాలం పాటు సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌ను అందించేలా, స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ తన పట్టును మరింత బలోపేతం చేసుకునేలా వీటిని తీసుకొచ్చింది. జనవరిలో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విడుదలైన మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్లు ఇవి.

Samsung Galaxy M16 5G Specifications: తక్కువ బడ్జెట్‌లో పవర్‌ఫుల్‌ 5G ఫోన్ తెచ్చిన శాంసంగ్, మార్కెట్లోకి గెలాక్సీ M16, గెలాక్సీ M06 5G ఫోన్లు, ధరతో పాటూ పూర్తి వివరాలివిగో.. 

ఇప్పుడు విడుదల చేసిన గెలాక్సీ A56, A36 A26 ఫోన్లు మూడింటికీ ఆరేళ్ల ఓఎస్‌ అప్‌గ్రేడ్‌, సెక్యూరిటీ ప్యాచెస్‌ను అందిస్తుంది శాంసంగ్. ఈ మూడు స్మార్ట్‌ఫోన్లు 120Hz రిఫ్రెష్ రేటుతో 6.7-అంగుళాల పూర్తి HD+ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చాయి. IP67 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్‌ రేటింగ్‌తో వీటిని విడుదల చేశారు. ఆండ్రాయిడ్ 15లో OneUI 7.0తో దీన్ని తీసుకొచ్చారు.

గెలాక్సీ A56 ఎక్సినోస్ 1580 ప్రాసెసర్‌తో పాటు ఏఎండీ Xclipse 540 జీపీయూతో పనిచేస్తుంది. ఇది 8జీబీ/12జీబీ ర్యామ్, 128జీబీ/256జీబీ స్టోరేజ్‌తో వచ్చింది. A56 ఫ్రంట్‌ కెమెరా OIS తో 50ఎంపీ సెన్సార్, 12ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 5ఎంపీ మాక్రో షూటర్‌తో వచ్చింది. A56 5జీ, బ్లూటూత్ 5.3, ఎన్‌ఎఫ్‌సీ సపోర్టుతో వచ్చింది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ కూడా ఉంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఇది వచ్చింది.

Samsung Unveils Galaxy A56 A36 A26 Ai Powered Mid Range Phones

 

శాంసంగ్‌ గెలాక్సీ A36 స్నాప్‌డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్‌తో వచ్చింది. అడ్రినో 710 జీపీయూతో ఇది పనిచేస్తుంది. ఇది 12జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. కెమెరాల విషయంలో A56లో ఉన్న ఫీచర్లే ఇందులోనూ అధికంగా ఉన్నాయి. అయితే, A56లోని 12ఎంపీ వన్‌కు బదులుగా ఇందులో 8MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో వచ్చింది. 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో దీన్ని విడుదల చేశారు. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో ఇది వచ్చింది.

గెలాక్సీ A26 మాలీ-జీ 68 ఎంపీ5 జీపీయూతో ఎక్సినోస్ 1380 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గెలాక్సీ A56, A36లా కాకుండా ఇది 6జీబీ/8జీబీ ర్యామ్‌, 128జీబీ/256జీబీ స్టోరేజ్‌తో వస్తోంది. మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్‌తో 1టీబీ వరకు దీన్ని పెంచుకోవచ్చు. ఇది 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 2ఎంపీ మాక్రో లెన్స్ తో వచ్చింది.

గెలాక్సీ A56, A36ల్లోని ఇన్ డిస్ప్లే స్కానర్‌కు బదులుగా సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇందులో ఉంటుంది. A26లో కూడా 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్‌ ఉంది. గెలాక్సీ ఏ 26లోనూ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. అయితే, 25డబ్ల్యూ ఛార్జింగ్‌కు మాత్రమే సపోర్టు చేస్తుంది.

గెలాక్సీ A56 లైట్ గ్రే, గ్రాఫైట్, ఆలివ్, పింక్‌ కలర్‌లతో వచ్చింది. 8జీబీ/128జీబీ మోడల్‌ ధర సుమారు రూ .44,000. అలాగే, 8జీబీ/256జీబీ ధర సుమారు రూ.48,000.

గెలాక్సీ A36 లావెండర్, బ్లాక్, వైట్‌, లైమ్‌ కలర్లతో వస్తుంది. 6జీబీ/128జీబీ, 8జీబీ/256జీబీ గెలాక్సీ A36 ధరలు వరుసగా సుమారు రూ .35,200, రూ.36,500గా ఉన్నాయి. అలాగే, బ్లాక్‌, వైట్, పీచ్ పింక్‌లలో వచ్చిన గెలాక్సీ A26, 6జీబీ/128జీబీ ధర సుమారు రూ .26,400, మరియు 8జీబీ/256జీబీ ధర సుమారు రూ.33,100గా ఉంది.