'Pushpa 2' Stampede: అల్లు అర్జున్‌కు మళ్లీ చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ, రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు

రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

Allu arjun (photo-Video Grab)

ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌కు హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 4న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె తనయుడు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వీడియో ఇదిగో, అల్లు అర్జున్ టీమ్ తమకు అండగా నిలుస్తోందని చెప్పిన శ్రీతేజ్ తండ్రి భాస్కర్, తెలంగాణ ప్రభుత్వం కూడా మాకు అండగా నిలిచిందని వెల్లడి

ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు నోటీసులు జారీ చేశారు. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని కూడా పోలీసులు కోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif