Govt. Money Scheme For Sunny Leone: సన్నీ లియోన్ కు నెలకు రూ.1000.. అకౌంట్ లోకి ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ నిధులు
వివాహిత మహిళల కోసం ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ పథకం తీసుకొచ్చిన ఆర్ధిక సాయం స్కీంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
Newdelhi, Dec 23: వివాహిత మహిళల కోసం ఛత్తీస్ గఢ్ (Chhattisgarh) ప్రభుత్వ పథకం తీసుకొచ్చిన ఆర్ధిక సాయం స్కీంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న మహతారి వందన్ యోజన పథకం కింద ప్రముఖ నటి సన్నీ లియోన్ (Sunny Leone) ప్రతి నెల రూ.1000 అందుకున్నారు. ఆమె అకౌంట్ లోకి నేరుగా నగదు జమ అవుతున్నది. ఇప్పుడీ విషయం ఆ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేగుతున్నది. పథకం నిధులు దారిమళ్లుతున్నాయని, అనర్హులకు కూడా లబ్ధి చేకూరుతున్నదని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
జాతీయ మీడియా అమ్ముడుపోయిందన్న వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన సీపీ సీవీ ఆనంద్ (వీడియో)
అసలు విషయం ఇది..
ప్రభుత్వ ఆదేశాలతో అసలు విషయం బయటకొచ్చింది. వీరేంద్ర జోషి అనే వ్యక్తి సన్నీ లియోన్ పేరుతో అకౌంట్ తెరచినట్లు పోలీసులు గుర్తించారు. బస్తర్ రీజియన్ లోని తూలూర్ చిరునామాతో బ్యాంక్ ఖాతా ఉన్నదని వెల్లడించారు. గత మార్చి నుంచి ప్రతి నెల రూ.1000 చొప్పున ఆ ఖాతాలో నగదు జమ అవుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ అకౌంట్ ను సీజ్ చేసి, జమ చేసిన మొత్తాన్ని త్వరలోనే వసూలు చేస్తామని తెలిపారు.
అల్లు అర్జున్ నివాసంపై దాడి కేసులో ఆరుగురి అరెస్ట్.. రిమాండ్.. బెయిల్