‘The Raja Saab’: ప్రభాస్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్, 80 శాతం పూర్తయిన రాజాసాబ్ షూటింగ్..టీజర్ పై టీం ఏమందంటే?
అలాగే రాజాసాబ్ వాయిదా పడుతుందని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ రూమర్స్ పై స్పందిస్తూ అధికారికంగా ఓ లెటర్ విడుదల చేసింది.
Hyderabad, DEC 18: డైరెక్టర్ మారుతీ (Maruthi) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న సినిమా ది రాజాసాబ్ (The Raja Saab). ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, పోస్టర్స్ రిలీజవడం, మొదటి సారి ప్రభాస్ (Parbhas) హారర్ చేయడం, మొదటి సారి ప్రభాస్ ముసలి పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తారని ప్రకటించారు.
అయితే రాజాసాబ్ టీజర్ క్రిస్మస్ కి లేదా న్యూ ఇయర్ కి వస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అలాగే రాజాసాబ్ వాయిదా పడుతుందని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ రూమర్స్ పై స్పందిస్తూ అధికారికంగా ఓ లెటర్ విడుదల చేసింది.
‘The Raja Saab’ Teaser Release Date To Be Announced Soon
ఈ లెటర్ లో.. రాజాసాబ్ షూటింగ్ కంటిన్యూగా రాత్రి, పగలు షెడ్యూల్స్ తో జరుగుతుంది. ఆల్మోస్ట్ 80 శాతం షూటింగ్ అయిపొయింది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇటీవల టీజర్ క్రిస్మస్ కి, న్యూఇయర్ కి వస్తుందని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అలాంటి రూమర్స్ నమ్మకండి. ఎలాంటి అప్డేట్స్ అయినా మేము అధికారికంగా ఇస్తాము. టీజర్ త్వరలోనే వస్తుంది. మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది అని తెలిపారు. దీంతో రాజాసాబ్ టీజర్ ఇప్పట్లో లేనట్టే అని తెలుస్తుంది. వచ్చే సంవత్సరమే ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టీజర్ రూమర్స్ పై స్పందించిన నిర్మాణ సంస్థ రాజాసాబ్ వాయిదా వార్తలపై మాత్రం స్పందించకపోవడం గమనార్హం.