Vishwambara Songs: విశ్వంభరపై కీరవాణి మార్క్..పాటలు అదిరిపోవాల్సిందంతే!

సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 2024 జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది.

vishwambara songs (Pic Credit to Vishwambara Twitter)

Hyderabad, Jul 16:మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం విశ్వంభర. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 2024 జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది.

షెడ్యూల్ ప్రకారం సినిమాకు ఎలాంటి అవాంతరాలు లేకుండా పనులు జరుగుతుండగా ఇప్పటికే సినిమా డబ్బింగ్ పనులను సైతం మొదలుపెట్టారు మేకర్స్. ఇక తాజాగా మ్యూజిక్ సిట్టింగ్స్‌లో బిజీగా ఉంది టీమ్. బెంగళూరులో సినిమా మ్యూజిక్ సిట్టింగ్ పనులు ప్రారంభం కాగా ప్రముఖ సింగర్స్‌తో కీరవాణి చిరు మేనియాకు ఏ మాత్రం తగ్గకుండా సంగీతం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరోవైపు సినిమా షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఎలాంటి అవాంతరాలు లేకుండాసినిమా పనులు జరుగుతున్నాయని, అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేసి తీరుతామని మేకర్స్ చెబుతుండటంతో ఈ విజువల్ వండర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.లైగర్ ఫ్లాప్ తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న సినిమా పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు రానుండా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు పూరి.

చిరు సరసన త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా యువీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి..హనుమాన్‌కి గొప్ప భక్తుడిగా కనిపించనుండగా యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని దర్శకుడు వశిష్ట కాన్ఫిడెంట్‌తో ఉన్నారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందిస్తున్నారు.



సంబంధిత వార్తలు