Double ISMART Second Single (Pic Credit to Puri Connects twitter)

Hyderabad Jul 16: లైగర్ ఫ్లాప్ తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న సినిమా పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు రానుండా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు పూరి.

చెప్పినట్లుగానే ఇవాళ సాయంత్రం 4 గంటలకు సినిమాలోని సెకండ్ సింగిల్ మార్ ముంత చోడ్ చింత ఫుల్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు. మాస్‌కి పునకాలు వచ్చే విధంగా ఇరగదీశాడు పూరి. మణిశర్మ మరోసారి తన మాస్ బీట్స్ తో పూనకాలు తెప్పించగా రామ్ డ్యాన్స్ అదుర్స్‌. ఇక రామ్‌కు ఏమాత్రం తీసిపోకుండా కావ్య థాపర్ అదరగొట్టింది. గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) వివాదం కొత్త ట్విస్టులు తిరుగుతున్నది. రాజ్ తరుణ్ ప్రియురాలిని అంటూ లావణ్య (Lavanya) అనే యువతి ఇచ్చిన ఫిర్యాదుపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) వివాదం కొత్త ట్విస్టులు తిరుగుతున్నది. రాజ్ తరుణ్ ప్రియురాలిని అంటూ లావణ్య (Lavanya) అనే యువతి ఇచ్చిన ఫిర్యాదుపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

ఫస్ట్ సాంగ్‌తో పోలిస్తే సెకండ్ సాంగ్ వెరే లెవల్ అని చెప్పాల్సిందే. పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాథ్‌, ఛార్మి నిర్మిస్తుండగా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తుండగా జియాని గియాన్నెలి సినిమాటోగ్రఫీ అందించారు. కాసేపటి క్రితమే రిలీజ్ అయిన సెకండ్ సింగిల్‌పై మీరు ఓ లుక్కేయండి..

Here's Full Video