Ira Khan Gets Engaged: బాయ్‌ఫ్రెండ్‌లో లిప్ కిస్ వీడియో పోస్ట్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో కూతురు, మా ఎంగేజ్‌మెంట్ అంటూ సైక్లింగ్‌ ఈవెంట్లో రచ్చ, మరోసారి వార్తల్లోకెక్కిన అమీర్ ఖాన్ గారాలపట్టి

ఆ తర్వాత ఇద్దరూ అందరూ చూస్తుండగానే లిప్ కిస్ ఇచ్చుకున్నారు. ఇక ఈ వీడియో వైరల్ (viral video) గా మారింది.

Mumbai, SEP 24: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) కూతురిగా ఐరాఖాన్ ( Ira Khan ) కూడా బాగా పాపులర్. ఇటీవల బికినిలో బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకొని బాగా వైరల్ అయింది ఐరాఖాన్( Ira Khan ). ఆ సమయంలో బాగా ట్రోల్ చేసినా మరిన్ని ఫొటోలు పోస్ట్ చేసి ఏం చేసుకుంటారో చేసుకోండి అని హడావిడి చేసి నెటిజన్లకు, మీడియాకి కావాల్సినంత స్టఫ్ ఇచ్చింది. తాజాగా మరోసారి ఐరాఖాన్ (Ira Khan) వైరల్ గా మారింది. ఐరాఖాన్ గత రెండేళ్లుగా సైక్లిస్ట్ నుపుర్ శిఖర్ (Nupur Shikhare) తో డేటింగ్ చేస్తుంది. గతంలో కూడా వీళ్లిద్దరు పార్టీలకి, పబ్బులకి తిరుగుతూ మీడియా కంట పడ్డారు. వీరిద్దరూ కలిసి ఓ వీడియోని అధికారికంగా పోస్ట్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira)

 

తాజాగా ఓ సైక్లింగ్ ఈవెంట్లో నుపుర్ ఐరాఖాన్ దగ్గరికివచ్చి మోకాళ్ళ మీద కూర్చొని రింగ్ ఇచ్చి పెళ్లి చేసుకుందామా అని అడగడంతో ఓకే అని చెప్పి రింగ్ పెట్టించుకుంది ఐరా. ఆ తర్వాత ఇద్దరూ అందరూ చూస్తుండగానే లిప్ కిస్ ఇచ్చుకున్నారు. ఇక ఈ వీడియో వైరల్ (viral video) గా మారింది. దీంతో నుపుర్, ఐరాఖాన్ ఇద్దరూ కలిసి అధికారికంగా ఈ వీడియోని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇదే మా నిశితార్థం అన్నట్టు అందరికి తెలిపారు. ఒకరికొకరు ఎస్ చెప్పుకున్నట్టు పోస్ట్ చేశారు.

Raju Srivastava Dies: చిత్రసీమలో మరో విషాదం, గుండెపోటుతో ప్రముఖ హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ మృతి 

దీంతో బాలీవుడ్ ప్రముఖులు, వారి స్నేహితులు సోషల్ మీడియా వేదికగా వీరికి కంగ్రాట్స్ చెప్తున్నారు. మరి ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో చూడాలి. దీనిపై అమీర్ ఖాన్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి మరి.