Aishwarya Lakshmi Crush: టీనేజ్ లో క్రికెటర్ యువరాజ్ సింగ్ తో లవ్ లో పడ్డా.. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి
డాక్టర్ వృత్తి నుంచి యాక్టర్ గా మారిన ఈ నటి పలు చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. టాలీవుడ్ లో 'గాడ్సే', 'అమ్ము' తదితర చిత్రాల్లో నటించింది.
Hyderabad, May 12: మలయాళ భామ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lakshmi) తెలుగు ప్రేక్షకులకు (Telugu Fans) కూడా సుపరిచితమే. డాక్టర్ (Doctor) వృత్తి నుంచి యాక్టర్ (Actor) గా మారిన ఈ నటి పలు చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. టాలీవుడ్ లో (Tollywood) 'గాడ్సే', 'అమ్ము' తదితర చిత్రాల్లో నటించింది. ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన 'పొన్నియన్ సెల్వన్' సినిమాలో కూడా ఐశ్వర్య మెరిసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తాను టీనేజ్ లో ఉండగా టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ తో ప్రేమలో పడ్డానని వెల్లడించింది. యువీ అంటే తనకు పిచ్చి అని... తన మనసులోనే ఆయనను ప్రేమించేదాన్నని చెప్పింది.
ప్రేమ వ్యవహారం వార్తలపై
యువ నటుడు అర్జున్ దాస్ కు, తనకు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందనే వార్తల్లో నిజం లేదని ఈ సందర్భంగా ఐశ్వర్య తెలిపింది. ఇద్దరూ క్లోజ్ గా ఉన్న ఫొటోలను వీరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో, ఇద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం ఊపందుకుంది. అయితే, తాము మంచి స్నేహితులం మాత్రమేనని, అంతకు మించి తమ మధ్య మరేమీ లేదని స్పష్టం చేసింది.