Newyork, May 12: ఇప్పటివరకూ పెట్రోల్ బైకు (Petrol Bike)లను చూశాం. కరెంటుతో (Electricity) నడిచే వాటినీ చూశాం. అయితే ఇప్పుడు ఈ రెండూ కాదూ.. బీర్ (Beer) తోనూ బైక్ ను పరుగులు పెట్టించ వచ్చని అమెరికా యువకుడు ఒకరు నిరూపించారు. సరికొత్త బైక్ ను తయారుచేసి ఔరా అనిపిస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ బైక్ ఇంకా రోడ్లపైకి రాలేదు. అయితే, మిన్నెసోటా (minnesota) రాష్ట్రంలో జరిగే స్థానిక ప్రదర్శనలలో ఉత్తమ ఆవిష్కరణ కేటగిరీలో ఇప్పటికే చాలా బహుమతులు గెల్చుకుంది.
Minnesota Man Creates Beer-Powered Motorcycle [VIDEO] https://t.co/JwIWP2yqxK
— Kat Kountry 105 (@KatKountry105) May 11, 2023
ఎందుకు తయారుచేశాడంటే?
పెట్రోల్ ధరలు నానాటికీ పెరిగిపోతుండడంతో ఈ వినూత్న బైక్ ను తయారుచేసినట్లు రూపకర్త మైఖల్సన్ వివరించాడు. ఈ బైక్ లో పెట్రోల్ ట్యాంక్ స్థానంలో నిర్మించిన డ్రమ్ములో బీర్ నింపి హీటింగ్ కాయిల్ ను ఆన్ చేస్తే.. గరిష్ఠంగా 240 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని మైఖల్సన్ చెప్పాడు.
Hema Malini on Allu Arjun: అల్లు అర్జున్‌ను చూసి నేర్చుకోండి.. బాలీవుడ్ హీరోలకు హేమా మాలిని క్లాస్