Allu Arjun-Hema Malini (Credits: Twitter)

Hyderabad, May 12: పుష్ప (Pushpa) మూవీలో డిఫరెంట్ లుక్ (Different Look), మేనరిజంతో పాన్ ఇండియా స్టార్ గా (Pan India Star) మారిపోయిన అల్లు అర్జున్ (Allu Arjun) కు నార్త్ లోనూ (North) అభిమానులు పెరిగిపోతున్నారు.ఇందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా బాలీవుడ్ నటి, డ్రీమ్ గర్ల్‌ గా పేరుగాంచిన హేమా మాలిని కూడా స్టైలిష్ స్టార్ అభిమానిగా మారిపోయింది. పుష్ప కోసం అల్లు అర్జున్ మేకోవర్ చూసి షాక్ తిన్న ఆమె.. బాలీవుడ్ హీరోలు ఎప్పటికీ ఇలా చేయరంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ‘నేను కూడా పుష్ప చూశా. చాలా బాగా అనిపించింది. ఆ సినిమాలో అల్లు అర్జున్ డ్యాన్స్ స్టెప్స్ ను చాలా మంది అనుకరించారు. అతని నటన బాగా నచ్చింది. అతనిదే మరో సినిమా కూడా చూశాను. ఎంతో అందంగా కనిపించాడు. అదే పుష్ప కోసం అతడు పూర్తిగా మాస్ లుక్ లో లుంగీ కట్టుకొని నటించాడు. అలాంటి క్యారెక్టర్ వేసినా కూడా అతడు హీరోనే. అలాంటి లుక్, రోల్ పోషించడానికి అతడు అంగీకరించడం అభినందనీయం. మన హిందీ సినిమాల హీరోలు ఇలా చేయలేరు. ఈ విషయాన్ని అందరూ చూసి నేర్చుకోవాలి’ అని హేమమాలిని అనడం విశేషం.

Poonam Kaur: పవన్‌ కాళ్ల కింద ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ పేరు, ఇది అహంకారమా? లేక అజ్ఞానమా అంటూ మండిపడిన హీరోయిన్ పూనమ్ కౌర్, ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌

ధర్మేంద్ర గురించి ఏమన్నారంటే?

రజియా సుల్తాన్ సినిమా కోసం కాస్త నల్లగా కనిపించాలంటే ధర్మేంద్ర వెనుకాడారేవారని ఈ సందర్భంగా హేమమాలిని గుర్తుచేశారు. అయితే, అల్లు అర్జున్ ఇలాంటి విషయాల్లో వెనుకాడేరకం కాదని ధీమా వ్యక్తం చేశారు.