Adipurush: ఆదిపురుష్‌ సినిమా టికెట్ ధర రూ. 2200, ఎగబడి కొంటున్న ప్రభాస్ ఫ్యాన్స్, అనేక చోట్ల నిమిషాల్లోనే హౌస్‌ఫుల్‌ బోర్డులు

ఆదిపురుషుడి అవతారంలో ప్రభాస్‌ను చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. సోషల్‌ మీడియాలో ఆదిపురుష్‌ హ్యాష్‌ ట్యాగ్‌(#AdipurushBookings, #Prabhas𓃵, #AdipurushOnJune16) ట్రెండింగ్‌లో ఉంది.ఈ నేపథ్యంలో టికెట్లు భారీ రేట్లు పలుకుతున్నాయి.

Adipurush (Credits: Twitter)

జూన్‌ 16వ తేదీన ప్రభాస్ ఆదిపురుష్‌ థియేటర్లలో సందడి చేయనుంది. ఆదిపురుషుడి అవతారంలో ప్రభాస్‌ను చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. సోషల్‌ మీడియాలో ఆదిపురుష్‌ హ్యాష్‌ ట్యాగ్‌(#AdipurushBookings, #Prabhas𓃵, #AdipurushOnJune16) ట్రెండింగ్‌లో ఉంది.ఈ నేపథ్యంలో టికెట్లు భారీ రేట్లు పలుకుతున్నాయి.

ఢిల్లీ ఆంబియన్స్‌ మాల్‌లోని పీవీఆర్‌ డైరెక్టర్స్‌ కట్‌ థియేటర్‌లో ఆదిపురుష్‌ టికెట్‌ ధర అక్షరాలా 2,200 రూపాయలు. ఇది కూడా కేవలం 2డీ ఫార్మాట్‌కు మాత్రమే! ఇక ఢిల్లీలోని పీవీఆర్‌ వేగాస్‌ లగ్జ్‌ థియేటర్‌లో కూడా ఒక్క టికెట్‌ ధర రెండు వేల రూపాయలుగా ఉంది. ఇంత ధర పలుకుతున్నా సరే ఫ్యాన్స్‌ ఎగబడి టికెట్స్‌ కొనడంతో అనేక చోట్ల నిమిషాల్లోనే హౌస్‌ఫుల్‌ అవుతుండటం విశేషం.

ఖమ్మం జిల్లాలో ప్రతి రామాలయానికి ఉచితంగా ‘ఆదిపురుష్’ టిక్కెట్లు.. జిల్లాలోని ప్రతి గ్రామంలోగల రామాలయానికి 101 ఉచిత టిక్కెట్లు

అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కూడా షురూ కావడంతో ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో కలిసి సినిమా చూసేందుకు సమాయత్తమయ్యారు ఫ్యాన్స్‌. టికెట్‌ రేటు ఎంతున్నా సరే తగ్గేదే లేదంటూ ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోకు టికెట్లు బుక్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అనేక చోట్ల థియేటర్లు హౌస్‌ఫుల్‌ అయిపోయాయి.

హైదరాబాద్‌లో త్రీడీ వర్షన్‌ టికెట్‌ ధర విషయానికి వస్తే కొన్ని చోట్ల రూ.325 నుంచి మొదలవుతుండగా మరికొన్ని చోట్ల రూ.400గా ఉంది. ఆదిపురుష్‌ సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్‌ రాఘవుడిగా, కృతీ సనన్‌ జానకిగా నటించారు. సైఫ్‌ అలీ ఖాన్‌ లంకేశ్వరుడిగా సన్నీ సింగ్‌ లక్ష్మణుడిగా కనిపించనున్నారు.