Samajavaragamana Video: నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు... ఆ చూపులనలా తిప్పుకోనియదు చూడు ఈ వీడియో సాంగ్, అల వైకుంఠపురములో నుంచి సామజవరగమన వీడియో సాంగ్ ప్రోమో విడుదల

ఎస్ థమన్ స్వరపరిచిన మనోహరమైన సంగీతానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి అర్థవంతమైన బాణీలతో సిద్ శ్రీరామ్ స్వరంతో బయటకువచ్చిన ఈ పాటకు అల్లు అర్జున్, పూజ హెగ్డే గ్లామర్ తోడై ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది...

#AlaVaikunthapurramuloo - Samajavaragamana Video Song | Photo: Aditya Music

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'అల వెంకఠపురములో' (Ala Vaikuntha purramuloo) సినిమా టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. మరోసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాయాజాలం పనిచేసినట్లు అనిపిస్తుంది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని లిరికల్ సాంగ్స్ సామజవరగమన, రాములో రాములా, OMG డాడీ మరియు బుట్టా బొమ్మా సక్సెస్ అయ్యాయి. ఇందులో సామజవరగమన,  రాములో రాములా.. సాంగ్స్ ఈ ఏడాదికే బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ట్రాక్స్ గా నిలిచాయి. టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ వీడియోలతో, కవర్ సాంగ్స్ తో ఈ పాటలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. యూట్యూబ్‌లో ఈ సాంగ్స్ ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ సాధించాయి. తెలుగులో వేగంగా 100 మిలియన్ వ్యూస్ సాంగ్స్ ఇవే కావడం విశేషం.

ఈరోజు న్యూ ఇయర్ ఈవినింగ్ సందర్భంగా సినిమా యూనిట్ సామజవరగమన వీడియో సాంగ్ ప్రోమోను విడుదల చేసి, స్టైల్‌గా న్యూ ఇయర్ విషెష్ చెప్పారు. 'నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు..' అంటూ సాగే లిరిక్స్ కు బన్నీ వేసిన స్టెప్స్, పూజ ఛార్మింగ్ సింప్లీ సూపర్బ్‌గా ఉన్నాయి.

Samajavaragamana Video Song

ఎస్ థమన్ స్వరపరిచిన మనోహరమైన సంగీతానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి అర్థవంతమైన బాణీలతో సిద్ శ్రీరామ్ స్వరంతో బయటకువచ్చిన ఈ పాటకు అల్లు అర్జున్, పూజ హెగ్డే గ్లామర్ తోడై ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది.

ఈ సినిమాలో టబు, నివేద పేతురాజ్, సుశాంత్, నవదీప్, జయరామ్, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, బ్రహ్మజీ మరియు సునీల్ వంటి ప్రముఖ నటీనటులు ఉన్నారు. జనవరి 12, 2020 న విడుదల కాబోతున్న అలా వైకుంఠపురములో, అదే సమయంలో విడుదల కాబోతున్న మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' తో సంక్రాంతి బరిలో పోటీపడనుంది.