Allu Arjun Approached High Court: హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్, సంధ్య థియేటర్ ఘటనలో కేసు కొట్టివేయాలని పిటీషన్
హైదరాబాద్ ఆర్జీసీ క్రాస్ రోడ్స్‌లో సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో భాగంగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశాడు.
Hyderabad, DEC 11: హీరో అల్లు అర్జున్ హైకోర్టును (High Court) ఆశ్రయించాడు. హైదరాబాద్ ఆర్జీసీ క్రాస్ రోడ్స్‌లో సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో భాగంగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. డిసెంబర్ 4న పుష్ప 2 (Pushpa-2) ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరగ్గా ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పైనా కేసు నమోదు చేశారు.
అల్లు అర్జున్ థియేటర్‌కు వస్తున్న విషయాన్ని పోలీసులకు ముందుగా తెలియజేయడంలో అలసత్వం వహించడంతోపాటు భద్రత విషయంలోనూ నిర్లక్ష్యం వహించారంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే బన్నీ.. తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.