Rajendra Prasad (Credits: X)

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ ఈ మధ్య ఓ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి విదితమే. ఈ వివాదం ముద‌ర‌డంతో తాజాగా రాజేంద్ర ప్ర‌సాద్‌ క్లారిటీ ఇచ్చారు. తాను అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. తాను పుష్ప సినిమాపై నెగిటివ్‌గా మాట్లాడాన‌ని వ‌చ్చిన వార్త‌లు చూసి మొద‌ట‌ న‌వ్వుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇన్ని సంవ‌త్స‌రాలుగా ఒక్క వివాదం లేదు క‌దా కొత్త‌గా ఇది వ‌చ్చిందంటూ ఎంజాయ్ చేశాన‌న్నారు. కానీ ఇది చేసింది ఎవ‌రో కానీ వాడికి ఒక్క‌టే చెబుతున్నాను. అది అల్లు అర్జున్‌ను ఉద్దేశించి అన‌లేదు అని న‌ట కిరీటి స్ప‌ష్టం చేశారు.

‘వాడెవడో చందనం దొంగ.. వాడు ఇప్పుడు హీరో అట..!’.. అల్లు అర్జున్, పుష్పపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (వీడియో)

ఇక‌ బ‌న్నీ త‌న‌కు కొడుకు లాంటి వాడ‌ని, అత‌డిని అలా ఎందుకు అంటాన‌ని పేర్కొన్నారు. అల్లు అర్జున్‌ నువ్వు నా బంగారం.. ల‌వ్ యూ అంటూ రాజేంద్ర ప్ర‌సాద్ తెలిపారు. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన వెబ్ సిరీస్ 'హ‌రిక‌థ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన‌ న‌ట కిరీటి.. "నిన్న కాక మొన్న చూశాం. వాడెవ‌డో చంద‌నం దుంగ‌ల దొంగ (పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్ర‌).. వాడు హీరో. ఇటీవ‌ల హీరో పాత్రలకు అర్థాలే మారిపోయాయి" అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్‌గా మార‌డంతో అల్లు అర్జున్ హీరోగా వ‌చ్చిన 'పుష్ప‌-2' చిత్రాన్ని ఉద్దేశించే రాజేంద్ర ప్ర‌సాద్ ఈ కామెంట్స్ చేశార‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డ్డారు.